Age gap in Marriage: ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారే తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వయసులో తేడా ఉంటుంది. సాధారణంగా పెళ్లిళ్లు చేసుకునేవారు అబ్బాయి కంటే అమ్మాయి వయసు రెండు లేదా ఐదు ఏళ్ల వరకు తక్కువగా ఉండాలి. కానీ నేటి కాలంలో వయసుతో సంబంధం లేదు.. మనసులు కలిస్తే చాలు అంటూ అబ్బాయి కంటే అమ్మాయి వయసు పెద్దదిగా ఉన్నా కూడా వివాహం చేసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక ప్రకారంగా దీనిని దోషంగా భావిస్తున్నారు. ఇలా పెళ్లిళ్లు చేసుకున్న వారికి వారహీన దోషం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. అసలు ఈ బలహీన దోషం అంటే ఏమిటి? దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి?
సాధారణంగా అబ్బాయి కంటే అమ్మాయి వయసు పెద్దదిగా ఉంటే వారి జీవితం బాగుంటుందని కొందరు మానసిక నిపుణులు చెబుతారు. ఎందుకంటే కుటుంబ విషయంలో ఆడవారిదే పనిచే ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో అమ్మాయి సరైన నిర్ణయాలు తీసుకుంటుందని అంటారు. అంతేకాకుండా స్త్రీలు ఎక్కువగా స్వతంత్రత కోరుకుంటారు. ఈ క్రమంలో వారు వయసులో పెద్దవారు అయితే ఇంటిని చక్కపెట్టేలా ప్రయత్నాలు చేస్తారు.
కానీ ఆధ్యాత్మిక ప్రకారం అబ్బాయి కంటే అమ్మాయి వయసు పెద్దదిగా ఉంటే దోషమని పండితులు అంటున్నారు. దీని వెనుక ఒక పురాతన కథ కూడా ఉంది. త్రేతా యుగంలో అనిరుదుడు అనే రాజు ఉండేవాడు. ఈ రాజు అందగాడు, తెలివైనవాడు కూడా. అయితే అతనికి వివాహ వయసు వచ్చిన తర్వాత కొందరు పండితులు కలిసి తనకంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటారు. కానీ ఆ రాజు దేవయాని అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి రాజు కంటే పెద్ద వయసు. ఎవరి మాట వినకుండా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత రాజ్యంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడు ఆందోళనకర వాతావరణం ఉంటుంది. దీంతో పండితులు రాజు జాతకం చూసి మీ జీవితంలో వరాహిన దోషం ఏర్పడిందని.. ఈ దోష పరిహారం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతారు.
శ్రీ మహావిష్ణువు అవతారం వరాహి. ఈ దేవతకు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల వరహీన దోషం తొలగిపోతుంది. వరహినం అంటే అబ్బాయి కంటే అమ్మాయి వయసు పెద్దదిగా ఉంటే… స్రీ శక్తి అధికమైపోతుంది. అప్పుడు పురుషుడి తేజస్సు తగ్గిపోతుంది. ధర్మం ప్రకారం పురుషుడి తేజస్సు ఎక్కువగా ఉండాలి.. పురుషుడు కంటే స్రీ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల జీవితంలో అసమతుల్యతలు ఏర్పడతాయి. ఇది శారీరకంగా, మానసికంగా సమస్యలను తీసుకొస్తాయి. ఈ విషయం చెప్పిన తర్వాత రాజుకు వరహిన దోషం తొలగిపోతుంది. ఇలా అబ్బాయి కంటే అమ్మాయి వయసు పెద్దదిగా ఉండడం వల్ల ఈ సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కానీ నేటి కాలం వారు మాత్రం వయసుతో సంబంధం లేకుండా మనసుతో జీవించగలుగుతామని చెబుతున్నారు.