Devotional Tips: భక్తి ఉన్న మహిళలు ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించి దేవుళ్లను పూజిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఇంట్లో దీపం వెలిగించే సమయంలో తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో దీపారాధన చేయడం వల్ల పిల్లలు వృద్ధిలోకి రావడంతో పాటు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
ఇంట్లో దీపారాధన చేయడం వల్ల కుటుంబ సభ్యులకు జ్ఞానం పెరుగుతుందని పండితులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజూ దీపారాధనను ఎవరైతే చేస్తారో వాళ్లకు దోషాలు తొలగిపోయే అవకాశంతో పాటు అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. బిజినెస్ లో రాణించాలని భావించే వాళ్లు బిజినెస్ చేసే ప్రాంతంలో దీపారాధన చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి.
దీపం అంటే దేవతాస్వరూపం అనే విషయాన్ని దీపం పెట్టేవాళ్లు గుర్తుంచుకోవాలి. దీపం వెలిగించడానికి నువ్వుల నూనె లేదా ఆవునెయ్యిలను వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి. దీపారాధన చేయడం కొరకు ఒక వత్తిని ఎప్పుడూ వాడకూడదు. ఒకటి కంటే ఎక్కువ వత్తులను వినియోగిస్తే మాత్రమే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
దీపాన్ని వెలిగించిన తర్వాత ప్రమిధకు గంధం, కుంకుమ, పూలు పెడితే పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. రోజుకు రెండు పూటలా దీపారాధన చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. ఇంటిని శుభ్రపరిచి ఉదయం సాయంత్రం దీపారాధాన చేయాలి. ఇత్తడి, వెండి, మట్టి ప్రమిదలో మాత్రమే దీపాన్ని వెలిగిస్తే అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Recommended Videos: