Himalayan Food Health Benefits: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కొన్ని పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పారు. వీటిని ప్రతి ఒక్కరూ తినాలని.. ఇవి తినడం వల్ల దగ్గు, జ్వరం తో పాటు క్యాన్సర్, ఇతర వ్యాధుల నుంచి బయటపడవచ్చని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటి గురించి చెప్పిన తర్వాత దేశంలో ఈ ఫ్రూట్స్ పై ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. కేవలం కాశ్మీర్లో-40 డిగ్రీల ఉష్ణోగ్రతలో పెరిగే వీటిని ఇటీవల నాసా స్పేస్ లో పెంచాలని ప్రకటించింది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ పండ్లు ఏవి? ఇవి భారతదేశంలో ఎక్కడ లభిస్తాయి? వీటిని ఎలా సేకరిస్తారు? వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
మనం రోజు తినే ఆహారం కంటే ప్రకృతిలో లభించే ఫ్రూట్స్లో అనేక విటమిన్లు, ఖనిజాలు లభ్యమవుతాయి. అందుకే ఆహారానికి తోడుగా ఫ్రూట్స్ ను కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం లభించే కొన్ని పండ్లు అంతేగా మారడంతో వాటిని తిని అనారోగ్యాల పాలవుతున్నారు. అంతేకాకుండా వీటిని కృతిమంగా పండిస్తున్నారు. అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ Sea Buckthorn అనే ఫ్రూట్స్ ను తినాలని సూచిస్తున్నారు. ఇవి కేవలం Ladakh లోనే పండిస్తారు. అది కూడా -40 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. అచ్చం నారింజ పండులా కనిపించే ఇది పసుపు రంగు లో ఉంటుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా యూరప్ దేశాల్లోని చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండిస్తారు.
అయితే భారతదేశంలో లభ్యమయ్యే దీనిని తినాలని ఎందుకు అంటున్నారు అంటే? ఇందులో చాలావరకు అధికమైన పోషకాలు ఉన్నాయి. సాధారణంగా ఆరెంజ్ లో సి విటమిన్ ఉంటుంది. కానీ కొన్ని ఆరెంజ్ ఫ్రూట్స్ కలిపితే ఎలాంటి సి విటమిన్ లభిస్తుందో అంత మొత్తంలో ఒకే ఫ్రూట్లో ఉంటుంది. అలాగే విటమిన్ E,A, ప్లవనాయిడ్లూ, ఒమేగా 3,6,7,9 చాటి ఆమ్లాలు, పొటాషియం, మాంగనీ, ఐరన్, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇలా మిగతా ఫ్రూట్స్ కంటే ఇందులో ఎక్కువగా పోషకాలు ఉండడంతో వీటిని తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. క్యాన్సర్ వంటి వ్యాధులు దూరం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఒకప్పుడు వీటిని ఎవరూ పట్టించుకోని వారు కాదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత వీటికి డిమాండ్ పెరుగుతుంది. అయితే ఇవి నేరుగా ఫ్రూట్స్ లాగా తీసుకోవడం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే వీడిచెట్లు ముళ్ళు అధికంగా ఉంటాయి. అందుకే కొన్ని కంపెనీలు దీనిని జ్యూస్ లాగా తయారుచేసి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిని సరఫరా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది కేవలం వ్యాధులను దూరం చేయడం మాత్రమే కాకుండా ఎనర్జీ తో పాటు చర్మం సమస్యలు రాకుండా కాపాడుతుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.