https://oktelugu.com/

బీపీతో బాధ పడేవారికి గుడ్ న్యూస్.. ఆ మందులతో దీర్ఘాయువు..?

దేశంలో రక్తపోటుతో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉప్పు ఎక్కువగా తినేవాళ్లు రక్తపోటుతో బాధ పడుతున్నారు. అయితే బీపీతో బాధ పడేవారికి జపాన్ కు చెందిన ఒక యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. ఎవరైతే రోజూ బీపీ మందులను వినియోగిస్తున్నారో వారి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. జపాన్ కు చెందిన ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. Also Read: చలికాలంలో మద్యం తాగే వారికి షాకింగ్ న్యూస్..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 28, 2020 / 07:10 PM IST
    Follow us on


    దేశంలో రక్తపోటుతో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉప్పు ఎక్కువగా తినేవాళ్లు రక్తపోటుతో బాధ పడుతున్నారు. అయితే బీపీతో బాధ పడేవారికి జపాన్ కు చెందిన ఒక యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. ఎవరైతే రోజూ బీపీ మందులను వినియోగిస్తున్నారో వారి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. జపాన్ కు చెందిన ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.

    Also Read: చలికాలంలో మద్యం తాగే వారికి షాకింగ్ న్యూస్..?

    రక్తపోటు బాధితులు వినియోగించే మెటోలజోన్‌ అనే ఔషధం ఆయువును పెంచుతున్నట్టు గుర్తించామని తెలిపారు. కొన్ని జంతువులపై ఈ మెడిసిన్ ను ప్రయోగించామని ఆ పరిశోధనల ఫలితాలను బట్టే ఈ విషయాలను వెల్లడిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. మన వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో మైటోకాండ్రియా సరిగ్గా పని చేసే అవకాశాలు తగ్గుతాయి. మెటోలజిన్ ఔషధం తీసుకునే వారిలో మైటోకాండ్రియా సక్రమంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Also Read: దేశ ప్రజలకు శుభవార్త.. ఆ వ్యాక్సిన్ తో కొత్తరకం కరోనాకు చెక్..?

    మైటోకాండ్రియా సక్రమంగా పని చేస్తే మనుషుల జీవన కాలం పెరుగుతుందని.. మెటోలజోన్ జన్యువులలో మార్పులు చేసి మైటోకాండ్రియాకు మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. హెచ్‌ఎస్‌పీఏ–6 జన్యువును రక్తపోటుకు వాడే మందులు ఉత్తేజపరుస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏలికపాములపై మెటోలజోన్ ఔషధం మంచి ఫలితాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు మనిషి ఆయువును పెంచే ఔషధాలకు సంబంధించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో పూర్తిస్థాయి సత్ఫలితాలను ఇవ్వలేదు. అయితే మెటోలజోన్ మంచి ఫలితాలను ఇస్తూ ఆయువును పెంచుతుండటంతో శాస్త్రవేత్తలు మనిషి ఆయువును పెంచే దిశగా మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.