ఈ మధ్య కాలంలో చాలామంది అధిక బరువు వల్ల ఇబ్బంది పడటంతో పాటు బరువు తగ్గడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. శారీరక వ్యాయామం ద్వారా మాత్రమే ఎవరైనా ఆరోగ్యకరంగా బరువు తగ్గగలరు. కండరాలకు తగిన పని కలిగి రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరిగి లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం పెరిగితే మాత్రమే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.
కొవ్వును తగ్గించే వ్యాయామాలైన ఏరోబిక్స్ ద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. వ్యాయామాల ద్వారా బరువు తగ్గాలని భావించే వాళ్లు సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్ చేయడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలామంది బరువు పెరగకుండా ఉండటానికి ఆహారం తక్కువగా తీసుకుంటారు.
అయితే ఆహారం తక్కువగా తీసుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. మంచి ఆహారం తీసుకుంటూనే వ్యాయామం చేస్తే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ప్రోటీన్లపై ఆధారపడటం, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, సమతులాహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. నీటిపాళ్లు ఎక్కువగా ఉండే కాయగూరలు తీసుకోవాలి. గుడ్డులో ఉండే అమైనో యాసిడ్లు కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి.
భోజనానికి అరగంట ముందుగా అరలీటర్ నీరు తాగితే మెటబాలిజం రేటు పెరగడంతో పాటు ఆకలి తగ్గుతుంది. బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఊబకాయుల్లో అడినోవైరస్ – 36 బరువు పెరగడానికి కారణమవుతోందని ఈ వైరస్‌ను తొలగిస్తే బరువు పెరగకుండా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.