https://oktelugu.com/

మంచిగుంటే బట్టకాల్చి మీదేస్తారు.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

‘‘మంచిగుంటనే బట్టకాల్చి మీదేసే రోజులివి.. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో సాదాసీదాగా ఉండాలి.. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలి.. జాగ్రత్తగా మాట్లాడాలి’’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు కార్పొరేటర్లకు హితబోధ చేశారు. నూతనంగా ఎన్నికైన వీరంతా ప్రగతిభవన్ లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2021 / 06:12 PM IST
    Follow us on

    ‘‘మంచిగుంటనే బట్టకాల్చి మీదేసే రోజులివి.. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో సాదాసీదాగా ఉండాలి.. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలి.. జాగ్రత్తగా మాట్లాడాలి’’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు కార్పొరేటర్లకు హితబోధ చేశారు. నూతనంగా ఎన్నికైన వీరంతా ప్రగతిభవన్ లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ సందర్భంగా కేసీఆర్ వారికి హితబోధ చేశారు. కొద్దిమందికే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం లభిస్తుందని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.

    మినీ ఇండియాగా.. విభిన్నమైన సంస్కృతుల నిలయంగా ఉన్న హైదరాబాద్ నగరంలో నగర వైభవాన్ని చాటేలా కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు పాటుపడాలని కేసీఆర్ సూచించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా జీవితంలో మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు.

    ఎన్నికైన కార్పొరేటర్లంతా బస్తీల్లో పర్యటించి పేదల కష్టాలు, గోసలు తీర్చాలని.. మేయర్, కార్పొరేటర్లు ఇదే పని పెట్టుకోవాలని కేసీఆర్ సూచించారు. వారి బాధలు అర్థం చేసుకోవాలన్నారు.

    తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని.. వాటికి సహకరించాలని కేసీఆర్ కోరారు. ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారని.. కానీ ఒక్కరికే మేయర్ అవకాశం దక్కుతుందని అన్నారు. అందరికీ మేయర్ ఇవ్వలేమని.. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరని అసంతృప్తులను చల్లార్చే ప్రయత్నం కేసీఆర్ చేశారు. అర్థం చేసుకొని అందరూ కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.