ఈ మధ్య కాలంలో దేశంలో 30 సంవత్సరాల వయస్సు ఉనవాళ్లు సైతం గుండెజబ్బులతో బాధ పడుతున్నారు. ఎక్కువ ఆహారం తీసుకుంటూ పొగ త్రాగడం, మద్యం అలవాటు ఉన్నవాళ్లు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. గుండె పనితీరు సరిగ్గా ఉంటే మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
చాలామంది ప్లేట్ లో ఎక్కువ మొత్తం వడ్డించుకుని తీసుకోవాల్సిన ఆహారం కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఊబకాయంతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నారింజ, నిమ్మ పండ్లను అధికంగా తీసుకోవాలి. నారింజ, నిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read: వంట నూనె వాడేవారికి షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కొత్తరకం మోసం..?
బిస్కెట్స్, ఆలూ చిప్స్ వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని ఫ్యాట్ లెవెల్స్ లేబుల్ ను చూసి వాటిని కొనుగోలు చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సమపాళ్లలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉన్న అహారపదార్థాలను తీసుకోవడం ద్వారా గుండె సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సిట్రస్ పండ్లతో పాటు గుడ్లు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
చిక్కుళ్లు, విత్తనాలు, పాలు, ఇతర పాల ఉత్పత్తులు గుండె సమస్యల బారిన పడకుండా రక్షించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్ పండ్లు, కూరగాయలు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి హృదయ సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పెరుగు, చికెన్, పొద్దుతిరుగుడు విత్తనాలు ఆక్సీకరణ వల్ల గుండెలోని కణాలకు జరిగే నష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా గుండె సమస్యలకు సులభ్ంగా చెక్ పెట్టవచ్చు.