Health Tips: ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కంటి నిండా నిద్ర అవసరం. కానీ నేటి కాలంలో చాలామంది వివిధ రకాల పనుల వల్ల సరైన నిద్రపోవడం లేదు. అంతేకాకుండా ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం చాలామందికి సమయం లేకపోవడంతో ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతున్నారు. సరైన నిద్ర గడియారం లేకపోవడంతో అనేక అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఒక వ్యక్తి 8 గంటలు నిద్ర పోకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు ఎనిమిది గంటలను నిద్రపోవాలని చూస్తారు. ఇందుకోసం భోజనం చేసిన వెంటనే నిద్ర పోవాలని అనుకుంటారు. చాలామందికి భోజనం చేసిన తర్వాత నిద్ర గాఢంగా వస్తుంది. అయితే భోజనం చేసిన తర్వాత నిద్రపోతే ఏం జరుగుతుంది అంటే?
Also Read: కబడ్డీ కథ తెలుసా మీకు?
మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే తిన్నావా ఆహారం జీర్ణం కావడానికి శరీరం కదలిక కచ్చితంగా ఉండాలి. నేటి కాలంలో చాలామంది శారీరక శ్రమ పడడం లేదు. దీంతో తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల ఆహారం ఏమాత్రం జీర్ణం కాకుండా ఉంటుంది. ఇలా జీర్ణం కాని ఆహారంతో లావు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఈ ఆహారం జీర్ణం కాకపోవడంతో అల్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల అన్నవాహికలో జీర్ణ రసాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇలా ప్రవహించడం వల్ల నిద్ర అసౌకర్యంగా ఉంటుంది. ఫలితంగా నిద్రపోయిన ఫలితం ఉండదు. అందువల్ల తిన్న వెంటనే నిద్రపోయే ప్రయత్నం ఏమాత్రం చేయొద్దని అంటున్నారు. మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వచ్చే అవకాశం ఉంటే తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి సమయంలో మాత్రం ఆహారం ఎక్కువ తీసుకున్న తిన్న వెంటనే నిద్రపోకుండా ఉండాలి.
రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం గంట పాటు తేలికపాటి నడక చేయాలి. లేదా గంట తర్వాత నిద్రపోయే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో ఆహారం జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. ఆహారం జీర్ణమైన తర్వాత నిద్రపోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకుంటే ఆహారం జీర్ణం కాకపోకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆహారం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అల్సర్ కు దారి తీసి ఆ తర్వాత గుండెపోటుకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకుండా కొవ్వు పేరుకుపోతుంది. ఇలా కొవ్వు పేరుకుపోయి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవద్దు. భోజనం చేసిన తర్వాత కాసేపు కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయాలి. లేదా వాకింగ్ చేయాలి. ఆ తర్వాత వేడి నీరు తాగి నిద్రపోవడం వల్ల హాయిగా ఉంటుంది.