Health Tips: చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో (Health Issues) బాధపడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే వాటి కంటే అనారోగ్యాన్ని ఇచ్చే వాటిని ఎక్కువగా తింటున్నారు. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ (Fast Food), పాస్తా (Pasta), నూడిల్స్ (Noodles) వంటి వాటిని చాలా మంది తింటున్నారు. వీటివల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం అయితే చాలు.. ఫాస్ట్ఫుడ్స్ (Fast Food) ఎక్కువగా తింటున్నారు. పెద్దవారు అనే కాకుండా పిల్లలకు కూడా వీటినే ఎక్కువగా ఇస్తున్నారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. వీటిలో పోషకాలు లేకపోవడం వల్ల అవి పిల్లల పెరుగుదలను నిలిపివేస్తాయి. దీనివల్ల పిల్లలు చిన్న వయస్సు నుంచే అనారోగ్య (Health Issues) సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా గుండె పోటు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బయట ప్రాసెస్డ్ చేసిన ఫుడ్‌లో పోషకాలు ఎక్కువగా ఉండవు. వీటివల్ల లేని పోని అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే పిల్లలు లేదా పెద్దలు సాయంత్రం సమయాల్లో స్నాక్స్‌గా పెసలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
పెసల్లో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా చేస్తుంది. వీటితో పాటు ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పెసల్లో అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా గుండె పోటు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. పిల్లలకు బయట చిప్స్, చాక్లెట్లు సాయంత్ర సమయాల్లో స్నాక్స్‌గా ఇవ్వడం కంటే వీటిని ఉడికించి ఇవ్వడం వల్ల ఆరోగ్యం కుదట పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డైలీ వీటిని వారికి ఏదో ఒక సమయంలో ఇవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని నిపుణులు అంటున్నారు. పిల్లలు డైలీ తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉంటారు. ఎముకలకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు అంటున్నారు. పెసల్లోని పోషకాలు పిల్లల మెదడుని కూడా మెరుగుపరుస్తుంది. మతిమరపు నుంచి విముక్తి కలిగిస్తుంది. పిల్లలు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. పెసల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులోని ఫైబర్ వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి డైలీ పిల్లలకు స్నాక్స్‌గా పెట్టడం అలవాటు చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.