Health Tips for Daily Life: ఉదయం లేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇదే సమయంలో కడుపులోకి ఏదైనా తీసుకోవాలని అనిపిస్తుంది. దీంతో చాలామంది ముందుగా కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. ఇందులోకి స్నాక్స్ యాడ్ చేస్తూ ఉంటారు. మరికొందరు టిఫిన్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్ని రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత సరైన రోగ నిరోధక శక్తి ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఉదయమే ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల నీరసంగా ఉంటుంది. దీంతో కలుషిత వాతావరణంను తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో వీటిని కలుపుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చు. మరి ప్రతిరోజు ఉదయం వేడి నీటిలో దేనిని కలుపుకోవాలి?
ఉదయం లేవగానే నీరు తీసుకోవడం కొందరికి అలవాటు. కానీ ఇది వేడి నీరు అయి ఉండి.. ఇందులో తేనె కలుపుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చల్లటి వాతావరణం లో గొంతు నొప్పి రాకుండా ఉంటుంది. తేనే రకరకాల బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీంతో ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. అలాగే జీర్ణక్రియ పెరుగుదలకు ఇది ఎంతో సహకరిస్తుంది. శరీరానికి తక్షణ శక్తి రావాలంటే వేడి నీరులో తేనె కలుపుకొని తాగాలి. బరువు తగ్గాలని అనుకునేవారు రోజు దీనిని తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చర్మం కాంతివంతంగా ఉండాలంటే కూడా ప్రతిరోజు ఉదయం ఈ ద్రవాన్ని తీసుకోవాలి.
వేడి నీటిలో అల్లం వేసుకుని తాగడం వల్ల కూడా అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం ఈ ద్రవం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పెంపొందుతుంది. అలాగే రాత్రి సమయంలో తిన్న ఆహారం డైజేషన్ కానీ సమయంలో వికారంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అల్లం నీరును తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. వేసవికాలంలో డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు దీనిని తీసుకోవాలని కొందరు వైద్యులు సూచిస్తూ ఉంటారు. కడుపులో మంట ఉన్నవారు సైతం దీనిని తీసుకోవచ్చు అని అంటున్నారు.
Also Read: నిత్యం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి..?
వేడి నీటిలో పసుపు వేసుకొని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారు దీనిని తీసుకోవాలి. గుండె సమస్యల నుంచి కూడా బయటపడాలని అనుకునేవారికి ఈ ద్రవం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజు పసుపు నీరు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఇది ఔషధంగా పనిచేస్తుంది.
వేడి నీటిలో నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సమస్యలు రాకుండా ఇది కాపాడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరగడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. శరీరం లో ఎలాంటి విష పదార్థాలు ఉన్న బయటకు వెళ్లడానికి నిమ్మరసం నీరు సహకరిస్తుంది. అందువల్ల ప్రతిరోజు వేడి నీటిలో పసుపు, అల్లం లేదా నిమ్మరసం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.