Homeహెల్త్‌Health Tips : చిన్న నిమ్మకాయ ఇన్ని ప్రయోజనాలను అందిస్తుందా?

Health Tips : చిన్న నిమ్మకాయ ఇన్ని ప్రయోజనాలను అందిస్తుందా?

Health Tips : నిమ్మకాయ వంటల రుచిని భలే పెంచేస్తుంది కదా. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం ఈ నిమ్మకాయం. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముందే వచ్చింది ఎండాకాలం. రోజు ఒక గ్లాసు నిమ్మకాయ నీరు కచ్చితంగా తాగాలి అనిపిస్తుంది. ఓ పెద్ద గ్లాసులో నిమ్మకాయ పిండి అందులో కాస్త షుగర్, ఉప్పు కలిపి తాగితే భలే అనిపిస్తుంది కదా. ఎండా వేడి నుంచి ఉపశమనం లభించినట్టుగా అవుతుంది. అయితే దీన్ని ఎలాంటి అనుమానం లేకుండా ప్రతి రోజు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. దీని వల్ల ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ. అవేంటంటే?

Also Read : మిల్లేట్స్ వండేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

అలసట- బలహీనం: మీరు కష్టపడి పనిచేయకుండానే అలసిపోయినట్లు, బలహీనంగా అనిపిస్తే శరీరంలో విటమిన్-సి లోపం అని అర్థం చేసుకోవాలి. ఇక ఈ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీర శక్తిని పెంచడంలో, అలసటను తగ్గించడంలో నిమ్మకాయ చాలా సహాయపడుతుంది. ప్రతిరోజూ నిమ్మకాయ తినడం వల్ల మీ శక్తి స్థాయి పెరుగుతుంది కూడా.

జీర్ణ సమస్యలు: తరచుగా కడుపులో గ్యాస్, మలబద్ధకం లేదా అజీర్ణం వంటి సమస్యలు ఉంటే, నిమ్మకాయ తీసుకోవడం ఇవన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే ఆమ్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

మీ చర్మం పొడిగా, నీరసంగా లేదా మొటిమలతో నిండి ఉంటే, అది శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతున్నాయనడానికి సంకేతం. నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని నిర్విషీకరణ చేయడంలో, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ నిమ్మకాయ తినడం వల్ల చర్మ సమస్యలు మెరుగుపడతాయి.

వేగంగా బరువు పెరుగుతున్నారా? తగ్గడం కూడా కష్టంగా అనిపిస్తుందా? అయితే నిమ్మకాయ మీకు సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తరచుగా జలుబు, దగ్గు లేదా ఇతర ఇన్ఫెక్షన్లకు గురవుతుంటే మీ రోగనిరోధక శక్తి బలహీనపడిందని సంకేతం. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వ్యాధులతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది.

నోటి నుండి దుర్వాసన: దుర్వాసన ఇబ్బందికరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సమస్యకు సంకేతం కూడా. నిమ్మకాయలో ఉండే ఆమ్లం నోటి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన నుంచి బయట పడవచ్చు. మీకు తరచుగా కీళ్ల నొప్పులు లేదా వాపు వంటి సమస్యలు వస్తుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయింది అని సంకేతం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper