Parota: చికెన్ లేదా పాలక్ పనీర్, మసాలా పనీర్ తో పాటు పరాటా ఉండాలి కానీ వావ్ ఆ కాంబినేషన్ ఏ అదుర్స్ అనిపిస్తుంది కదా. నాన్ లు, పరాటాలు, రుమాల్ రోటీలు అంటే ఇష్టపడని వారు ఉంటారా? ముఖ్యంగా ప్రయాణాలలో ఎక్కువగా రాత్రి పూట హోటళ్లలో తొందరగా తినడానికి అందుబాటులో ఉండేది పరోటానే అదే అనువుగా లాగించేస్తారు కూడా. మరి ఈ పరాటాను ఎక్కువ తినడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అంటే అవును అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా మధుమేహం బారిన పడే అవకాశం ఉందట.
అయితే పరోటాలను మైదాపిండితో తయారు చేస్తారు అనే విషయం తెలిసిందే. గోధుమల నుంచి తయారు చేసిన గోధుమపిండి నుంచి దాని పొట్టు, ఎండో స్పెర్మ్ తొలగించడం ద్వారా మైదాపిండి తయారవుతుంది కాబట్టి. గోధుమపిండిలో ఉన్న పోషకాలు, పీచు పదార్థాలు ఎగిరిపోతాయి. అంతేకాదు ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా చేరి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది మైదా.
శరీరంలో మధుమేహాన్ని కలిగించే ప్రధాన వంటకం ఏంటి అంటే ముందుగా మైదా పేరు చెబుతారు నిపుణులు. 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి అని మీకు తెలుసా?. ఇందులో 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల పీచు, 74.27 గ్రాముల పిండిపదార్థాలు మిళితమై ఉంటాయి. ఈ పీచు లేని మైదాను తక్కువ తిన్నా వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మందంగా ఉండే పరోటాలు ఉడకడానికి అధిక నూనెను వాడుతుంటారు.
దీని వల్ల గుండె మీద ప్రభావం పడుతుంది. అంతేకాదు మరిన్ని గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. అందుకే పరోటాకు దూరంగా ఉండటం మంచిది. మరీ ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని వైపు కన్నెత్తి చూడకుండా ఉండటం, దాని గురించి ఆలోచించకుండా ఉండటమే ఆరోగ్యానికి చాలా మంచిది.