https://oktelugu.com/

Health Issue: అరుదైన కవాసకి వ్యాధి అంటే? ఇది ప్రమాదమేనా?

మారుతున్న జీవనశైలి లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమో కానీ కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మంది అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇటీవల కొందరు పిల్లలు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కవాసకి అనే ఓ అరుదైన వ్యాధి ఈ మధ్య పిల్లలను ఎక్కువగా వేధిస్తుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 11, 2024 / 03:45 AM IST

    kids

    Follow us on

    Health Issue: మారుతున్న జీవనశైలి లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమో కానీ కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మంది అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇటీవల కొందరు పిల్లలు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కవాసకి అనే ఓ అరుదైన వ్యాధి ఈ మధ్య పిల్లలను ఎక్కువగా వేధిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చిన్న పిల్లలకు వస్తుంది. ఆరు నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలోనే ఈ వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి రక్తనాళాల్లో సరిగ్గా రక్తం సరఫరా కాకపోవడం వల్ల వస్తుంది. కవాసకి సిండ్రోమ్ అనేది అరుదైన వాస్కులైటిస్ అంటే రక్తనాళాల వాపు వ్యాధి. ఈ వ్యాధి శరీరంలోని ధమనులు అన్నింటినీ ప్రభావితం చేస్తాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేయకుండా సమస్యలను కలిగిస్తాయి. చాలా అరుదుగా సంభవించే ఈ వ్యాధితో చాలా మంది పిల్లలు బాధపడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, జపాన్, కొరియా, తైవాన్లలో ఎక్కువ మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

    ఈ కవాసకి వ్యాధికి గురైన పిల్లలో మొదటిగా జ్వరం వస్తుంది. ఆ తర్వాత కళ్లు గులాబీ రంగులోకి మారడం, పెదవులు లేదా నాలుక ఎరుపు రంగులోకి మారడం, పగుళ్లు రావడం, చేతులు, పాదాల వాపుకు గురి కావడం, చర్మంపై పొట్టు రావడం, దద్దుర్లు వంటివి కూడా వస్తాయి. వీటితో పాటు మెడ ఉబ్బడం, కడుపులో నొప్పి, బొడ్డు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి రావడానికి గల కారణం ఏంటని సరిగ్గా తెలియదు. కానీ ఎక్కువగా శీతాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించిన తర్వాత వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. ముఖ్యంగా పిల్లల గుండెలో మంట, కాలేయంలో హెపటైటిస్, ఊపిరితిత్తులలో వాపు, గుండెలో ఇన్ఫెక్షన్లు వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా తొందరగా పిల్లలకు చికిత్స చేయడం బెటర్.

    కవాసకి వ్యాధి మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో కేవలం వారం రోజుల వరకు మాత్రమే జ్వరం ఉంటుంది. చేతులు, అరికాళ్లలో ఎర్రగా మారుతాయి. అదే రెండో దశలో జ్వరం, కడుపు నొప్పి వంటివి కనిపిస్తాయి. మూడో దశలో సమస్య ఉంటుంది. కానీ పెద్దగా లక్షణాలు కనిపించవు. కాబట్టి ఏ చిన్న లక్షణం కనిపించిన కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లండి. రక్త పరీక్షలు, యూరిన్, ఎకోకార్డియోగ్రామ్, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, ఎమ్‌ఆర్‌ఏ స్కానింగ్‌ చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ధమనుల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి. చికిత్స తీసుకుంటూ ఇవి చేస్తే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.