https://oktelugu.com/

Gopichand-Sandeep Vanga combination : గోపీచంద్, సందీప్ వంగ కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా అదేనా..దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే గోపీనే!

గోపీచంద్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మిస్ అయ్యాడు. అప్పట్లో గోపీచంద్ కి ప్రస్తుత పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఒక పవర్ ఫుల్ కథని వినిపించాడట. అప్పటికి ఆయన కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రమే పని చేస్తుండేవాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 11, 2024 / 04:06 AM IST

    Gopichand-Sandeep Vanga combination

    Follow us on

    Gopichand-Sandeep Vanga combination :మన టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోల లీగ్ లోనే మిగిలిపోయిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది గోపీచంద్ అని చెప్పొచ్చు. ఒక విలన్ గా ఆడియన్స్ లో మంచి ఇమేజి సంపాదించుకున్న నటుడు, మళ్ళీ హీరోగా మారి సక్సెస్ అవ్వడం అనేది మన ఇండస్ట్రీ లో అంతకు ముందు కేవలం మోహన్ బాబు విషయంలో మాత్రమే జరిగింది. మళ్ళీ ఆ తర్వాత గోపీచంద్ విషయంలోనే జరిగింది. హీరో గా యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం, గోలీమార్, లౌక్యం ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అయితే ‘లౌక్యం’ చిత్రం తర్వాత గోపీచంద్ తీసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి.

    గౌతమ్ నంద లాంటి మంచి సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. మధ్యలో ‘సీటిమార్’ అనే చిత్రం ఒక్కటే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన ‘విశ్వం’ చిత్రం కూడా పర్వాలేదు అనే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద రన్ అయ్యింది. కానీ ఆయన రేంజ్ హిట్ మాత్రం తగలడం లేదు. చాలా సినిమాలు ఆయన ఫ్లాప్ అవుతాయని తెలిసి కూడా ఒప్పుకొని నటించాడు. ఆ చిత్రాలు ఆయన ఊహించినట్టుగానే కమర్షియల్ గా ప్లాప్స్ అవ్వడం కాకుండా గోపీచంద్ మార్కెట్ ని బాగా దెబ్బ తీసింది. ఇదంతా పక్కన పెడితే గోపీచంద్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మిస్ అయ్యాడు. అప్పట్లో గోపీచంద్ కి ప్రస్తుత పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఒక పవర్ ఫుల్ కథని వినిపించాడట. అప్పటికి ఆయన కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రమే పని చేస్తుండేవాడు.

    అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే ఎంతో మంది హీరోలకు కథలు వినిపిస్తూ అవకాశాల కోసం తిరిగేవాడట సందీప్ వంగ. అలా గోపీచంద్ వద్దకు కూడా ఆయన వెళ్ళాడు. కానీ ఎందుకో గోపీచంద్ కి ఆ కథ నచ్చలేదట. కథలో వయొలెన్స్ చాలా ఉందని, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా లేదని, నా సినిమాలకు ఎక్కువగా వచ్చేది వాళ్లేనని చెప్పి ఈ కథని రిజెక్ట్ చేసి ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాతో రమ్మని చెప్పాడట. దీంతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కుదిరి, గోపీచంద్ చేసి ఉండుంటే ఈరోజు ఆయన రేంజ్ ఇలా ఉండేది కాదని, స్టార్ హీరోల లీగ్ లో ఉండేవాడిని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకే గోపీచంద్ ని అందరూ దారిద్య్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని అంటుంటారని ఆయన్ని అభిమానించే వాళ్ళు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.