Homeలైఫ్ స్టైల్Chaddannam Benefits: చద్దన్నంలో ఎలాంటి పోషకాలు ఉంటాయి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..

Chaddannam Benefits: చద్దన్నంలో ఎలాంటి పోషకాలు ఉంటాయి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..

Chaddannam Benefits: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మండుతున్న ఎండ వేడి నుంచి రక్షించుకునేందుకు వాటర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. మన పూర్వీకులు ప్రతీ ఎండాకాలంలో చద్దన్నంను ఎక్కువగా తీసుకునేవారు. ఈఆహారపు అలవాటు యాదృచ్ఛికంగా కాదు, శాస్త్రీయంగా కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఉదయాన్నే పెరుగు, ఉల్లిపాయతో కలిపి తినే చద్దన్నం (పులిసిన అన్నం) ఆరోగ్యానికి అమృతంతో సమానం అని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో చూద్దాం..

రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు లేదా నీరు కలిపి రాత్రంతా ఉంచితే అది సహజంగా పులుస్తుంది. ఈ ప్రక్రియను Fermentation అంటారు. ఈ ఫెర్మెంటేషన్ వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి, ఆహారం మరింత పోషకంగా మారుతుంది. అందుకే దీన్ని ఉదయం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలా తయారైన చద్దన్నంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఫెర్మెంటేషన్ వల్ల ఇవి శరీరానికి సులభంగా అందుబాటులోకి వస్తాయి. దీంతో ఎముకలు బలపడటం, రక్తహీనత తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

వేసవికాలంలో శరీరంలో వేడి పెరుగుతుంది. అలాంటి సమయంలో చద్దన్నం తీసుకోవడం వల్ల శరీరానికి సహజమైన చల్లదనం లభిస్తుంది. వడదెబ్బ (హీట్ స్ట్రోక్), అలసట వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. చద్దన్నంలో ఉన్న ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది Digestive systemను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గి, కడుపు ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ ఆహారం వల్ల శరీరంలో టాక్సిన్స్ తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఉదయం చద్దన్నం తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది, రోజంతా అలసట లేకుండా ఉత్సాహంగా ఉండగలుగుతారు.

చద్దన్నంలో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరపకాయలు లేదా ఆవకాయ కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా రైతులు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరం. చద్దన్నం అనేది సాధారణమైన ఆహారం అయినా, దాని వెనుక గొప్ప ఆరోగ్య రహస్యం ఉంది. మన పూర్వీకుల ఆహారపు అలవాట్లను మళ్లీ అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజువారీ జీవితంలో ఈ చిన్న మార్పు పెద్ద ప్రయోజనాలను అందిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper