Heart Attack: సాఫ్ట్ వేర్ జాబ్ కష్టపడి కొట్టి జాబ్ లో చేరేవేళే గుండెపోటుతో మృతి.. తీరని విషాదం

Heart Attack: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఆ దంపతులిద్దరూ చెమటోడ్చి తమ పిల్లలను పెంచారు. విద్యాబుద్ధులు నేర్పించారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. కుమారుడ్ని ఇంజనీరింగ్ వరకూ చదవించారు. ఇటీవలే కుమారుడికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం రావడంతో సంబరపడిపోయారు. తమ కష్టాలు తీరిపోతాయని ఆనందపడ్డారు. అయితే వారి ఆనందం చూసి విధికి కన్నుకుట్టిందేమో కానీ.. వారం రోజుల్లో ఉద్యోగంలో చేరుతాడన్న కుమారుడ్ని గుండెపోటు రూపంలో మృత్యువు మిగిల్చింది. కన్నవారికి అంతులేని విషాదం మిగిల్చింది. […]

Written By: Dharma, Updated On : March 11, 2023 1:26 pm
Follow us on

Heart Attack: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఆ దంపతులిద్దరూ చెమటోడ్చి తమ పిల్లలను పెంచారు. విద్యాబుద్ధులు నేర్పించారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. కుమారుడ్ని ఇంజనీరింగ్ వరకూ చదవించారు. ఇటీవలే కుమారుడికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం రావడంతో సంబరపడిపోయారు. తమ కష్టాలు తీరిపోతాయని ఆనందపడ్డారు. అయితే వారి ఆనందం చూసి విధికి కన్నుకుట్టిందేమో కానీ.. వారం రోజుల్లో ఉద్యోగంలో చేరుతాడన్న కుమారుడ్ని గుండెపోటు రూపంలో మృత్యువు మిగిల్చింది. కన్నవారికి అంతులేని విషాదం మిగిల్చింది. హైదరాబాద్ లో వెలుగుచూసి ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగురుబు గ్రామానికి చెందిన కొట్టె మురళీకృష్ణ (26) హైదరాబాద్ లో ఓ సినిమా థియేటర్ లో సినిమా చూస్తూ కుప్పకూలిపోయాడు. స్నేహితులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో మరణించినట్టు నిర్థారించారు. ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తిచేసిన మురళీకృష్ట సాఫ్ట్ వేర్ శిక్షణ తీసుకున్నాడు. ఓ కంపెనీ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ నెల 17నే ఉద్యోగంలో చేరాల్సి ఉంది. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లగా.. ఈ ఘటన చోటుచేసుకుంది.

మురళీకృష్ణ తల్లిదండ్రులు పెద్దకృష్ణ, రాధలు రోజువారి కూలీలు. వీరికి మురళీకృష్ణతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందర్నీ అతి కష్టమ్మీద చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. ఆడ పిల్లలకు వివాహాలు చేసి మెట్టినింటికి పంపించారు. కుమారుడు మురళీకృష్ణ ఉద్యోగం చేసి తమ కష్టాలను తీర్చుతాడని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల బీటెక్ పూర్తిచేసిన మురళీకృష్ణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు. ఈ నెల 17న జాయిన్ కావాల్సి ఉండగా.. స్వగ్రామం నక్కలగురుబు వెళ్లి కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపాడు. కుటుంబ బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. స్నేహితులతో సినిమాకు వెళ్లిన మురళీకృష్ణ గుండెపోటుకు గురయ్యాడు. అంతులేని విషాదం మిగిల్చాడు.