Dreams: మన హిందూ సంప్రదాయంలో కలలకు కూడా ప్రాధాన్యం ఇస్తుంటారు. కొన్ని సార్లు కొన్నింటిని మనం కలలో చూస్తే అరిష్టమని కొన్నింటిని చూస్తే మంచిదని చెబుతుంటారు. దీని ప్రకారం మనకు వెన్నంటుకుంటే కన్నంటుకుంటుంది. ఇక కలలైతే ఏవేవో వస్తుంటాయి. ఎన్నో కష్టాలు నష్టాలు మనం కలలో చూస్తుంటాం. ఏదైనా ఆపద వస్తే కాలు కదలదు. నోరు మెదలదు. మెదడైతే పని చేయకుండానే పోతోంది. అలాంటి కలలపై మనకు కూడా కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే.
స్వప్న శాస్త్రం ప్రకారం మనకు కలలో రామచిలుకలు కనిపిస్తే మంచిదట. భవిష్యత్ లో మనం కుబేరులం కాబోతున్నామనే సంకేతానికి నిదర్శనమేనట. అందుకే కలలో మనకు రామచిలుకలు కనిపిస్తే ఇక మనకు తిరుగే ఉండదని చెబుతారు. మరో జంతువు ముంగీసను చూస్తే కూడా శుభశకునమే. ఒకవేళ కలలో ముంగీస కనిపిస్తే త్వరలో వెండి, బంగారు ఆభరణాలు దొరుకుతాయని తెలుస్తోంది. అందుకే ముంగీస కూడా మంచిదే అని విశ్వసిస్తారు.
కలలో తేనెటీగను చూస్తే కూడా మంచిదే. నిద్రలో మనం కనే కలలో తేనెటీగ కనిపిస్తే రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచైనా ధనం వస్తుందని చెబుతారు. అందుకే తేనెటీగ కూడా శుభపరిణామమే అని తెలుసుకోవాలి. కలలో చీమలు కనిపించడం కూడా శుభప్రదమే. మీకు ఒకవేళ చీమలు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారనే సంకేతమని చెబుతారు.
స్వప్న శాస్త్రం ప్రకారం ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకుంటాం. కొన్నింటిని మాత్రం శుభాలుగా కొన్నింటిని అశుభాలుగా భావిస్తారు. కలలో తేలు కనిపిస్తే కూడా సందలకు చిహ్నంగా చెబుతారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సంకేతం. అందుకే కలల్లో కనిపించే వాటికి కూడా ఎన్నో ఆధారాలు చూపిస్తారు. మొత్తానికి కలలో పై జంతువులు కనిపిస్తే చాలా మంచిదని పురాణాల ప్రకారం చెబుతున్నారు.