Health Insurance: దేశంలో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకుంటున్నారు. కరోనా విజృంభించిన సమయంలో చాలామంది వైరస్ బారిన పడి చనిపోయారు. కరోనా సోకిన సమయంలో కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ ను వినియోగించుకుని వైద్య చికిత్స చేయించుకున్నారు. అయితే కొంతమంది అన్ని అర్హతలు ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవడంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Also Read: తిరుపతి ఐఐటీలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్ష రూపాయల వేతనంతో?
ఏ బీమా అయినా 30 రోజులలో క్లెయిమ్ ను పరిష్కరించి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ను తిరస్కరిస్తే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. దేశంలో 17 లోక్ పాల్ కేంద్రాలు ఉండగా క్లెయిమ్ ను తిరస్కరిస్తే లోక్ పాల్ కేంద్రాలలో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. www.irdai.gov.in వెబ్ సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఫిర్యాదు చేసే సమయంలో చికిత్స పత్రాలతో పాటు బిల్లులను జత చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా క్లెయిమ్ ను తిరస్కరించే అవకాశం అయితే ఉండదు.
Also Read: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండానే?