Homeఎంటర్టైన్మెంట్Dhee Promo: ఢీ స్టేజి పైన మంచు అక్క.. కంటతడి పెట్టిన రష్మీ

Dhee Promo: ఢీ స్టేజి పైన మంచు అక్క.. కంటతడి పెట్టిన రష్మీ

Dhee Promo: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో గా ప్రారంభమయి విజయవంతంగా దూసుకెళ్తున్న షో “ఢీ”…. 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ (“ఢీ” 13వ సీజన్) గా ప్రేక్షకుల్ని అలరించడానికి వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించడానికి సిద్దమైంది. కింగ్స్ టీమ్ కి సుడిగాలి సుధీర్ ,హైపర్ ఆది, క్వీన్స్ టీమ్ కి రేష్మి, టిక్ టాక్ స్టార్ దీపికా పిల్లి గ్రూప్ లీడర్స్ గా వ్యవహరిస్తుంటే … జడ్జెస్ గా గణేష్ మాస్టర్ గారు, హీరోయిన్స్ ప్రియమణి, పూర్ణ వ్యవహరిస్తారు. ఈ షో కి ప్రముఖ యాంకర్ “ప్రదీప్ మాచిరాజు” వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఢీ కార్యక్రమం విజయవంతం గా సెమీఫైనల్ – 2 వరకు చేరుకుంది. ఫైనల్ దశకు అతి చేరువలో ఉన్న ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి గెస్ట్ గా వచ్చింది. అయితే క్వీన్స్ టీం, కింగ్ టీం పోటా పోటీగా ప్రదర్సనలు కనబరుస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ని చూస్తే తెలిసి పోతుంది.

వకీల్ సాబ్ సినిమా నుండి మగువా మగువా అనే పాటకు డాన్స్ వేసింది నయనికా.. చాలా ఎమోషన్ టచ్ ఉండే ఈ పాటకి చాలా మంచి క్రేజ్ ఉంది. అయితే నయనికా చేసిన పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. అయితే రష్మి చాలా ఎమోషనల్ అయ్యినట్లు ప్రోమో లో చూపించారు. నయనికా సింగల్ పేరెంట్ చైల్డ్ అని, ఒరిస్సా లో పెరిగిందని సేమ్ రష్మి లాగే నని చెప్పి బాగా ఎమోషనల్ అయ్యింది. ఇది చూసి మంచు లక్ష్మి తో పాటు ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు.

 

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.
Exit mobile version