Side Effects Of Hair Dyeing: జుట్టుకు కలర్ వేసేవాళ్లకు షాక్.. ఆ ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట!

Side Effects Of Hair Dyeing: ఈ మధ్య కాలంలో పోషకాహార లోపం వల్ల, జన్యు సంబంధిత సమస్యల వల్ల చాలామంది చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఈ సమస్యను అధిగమించడం కోసం హెయిర్ డైలపై ఆధారపడుతున్నారు. అయితే నెలకు ఒకసారి హెయిర్ డైని వాడేవాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హెయిర్ డై ఉపయోగించే వాళ్లు సెమీ పర్మినెంట్ హెయిర్ డై వాడాలి. హెయిర్ […]

Written By: Navya, Updated On : March 1, 2022 11:55 am
Follow us on

Side Effects Of Hair Dyeing: ఈ మధ్య కాలంలో పోషకాహార లోపం వల్ల, జన్యు సంబంధిత సమస్యల వల్ల చాలామంది చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఈ సమస్యను అధిగమించడం కోసం హెయిర్ డైలపై ఆధారపడుతున్నారు. అయితే నెలకు ఒకసారి హెయిర్ డైని వాడేవాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హెయిర్ డై ఉపయోగించే వాళ్లు సెమీ పర్మినెంట్ హెయిర్ డై వాడాలి.

Side Effects Of Hair Dyeing

హెయిర్ డై వాడేవాళ్లు ప్యాచ్ టెస్ట్ ను చేయించుకోవాలి. హెయిర్ డైలో ఉండే ఫార్మాల్డిహైడ్, బొగ్గు , సీసం వివిధ క్యాన్సర్లకు కారకాలవుతాయి. గర్భధారణ సమయంలో మహిళలు జుట్టుకు కలర్ వేసుకుంటే పుట్టబోయే పిల్లలపై ఆ ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పిల్లలకు పాలిచ్చే మహిళలు కూడా హెయిర్ డైలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. హెయిర్ డైలో ఉండే కెమికల్స్ అలెర్జీలకు కారణమయ్యే అవకాశాలు ఉండవు.

Also Read: వైఎస్ వివేకా అల్లుడి సంచలన స్టేట్ మెంట్.. జగన్ పైనే ఆరోపణలు?

హెయిర్ డైలో వినియోగించే రెసోర్సినాల్ అనే కెమికల్ వల్ల మహిళల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మహిళలు హెయిర్ డైల వాడకానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. హెయిర్ డైలలో కొన్ని కంపెనీలు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కెమికల్ ను వినియోగిస్తాయి. ఈ కెమికల్ వల్ల ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

హెయిర్ డైలలో వినియోగించే బి-ఫెనిలెనెడిమైన్ మూత్రాశయ క్యాన్సర్ కు కారణమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్లాక్, గ్రే హెయిర్ డైలను వినియోగించే సమయంలో క్యాన్సర్ వచ్చే అవకాశం మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

Also Read: సంజ‌య్ రెండో విడ‌త పాద‌యాత్ర ఆ రోజునుంచే.. చాలా పెద్ద ప్లాన్ వేశాడుగా

Recommended Video: