Corona Vaccine: దేశంలోని ప్రజలు కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే దేశంలోని మెజారిటీ ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంతో థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ పెద్దగా ప్రభావం చూపలేదు. థర్డ్ వేవ్ సమయంలో కరోనా కేసులు, మరణాలు తక్కువగా నమోదయ్యాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ 18 ఏళ్లు వయస్సు పైబడిన వాళ్లకు బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందని సమాచారం అందుతోంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే కొంతమందికి మూడో డోసు తీసుకుంటే మాత్రమే పలు దేశాలు అనుమతిస్తున్నాయి. ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ లో పని చేసేవాళ్లకు మాత్రం కేంద్రం మూడో డోసు ఇస్తోంది.
Also Read: Petrol Diesel Price: మోడీ సార్ బాదుడు మొదలెట్టాడు.. వామ్మో గ్యాస్.. మళ్లీ పెట్రో మంటలు
మిగిలిన వాళ్లకు కూడా కేంద్రం మూడో డోసు ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. అయితే కేంద్రం ఉచితంగా మూడో డోసును ఇస్తుందా? లేక డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రం 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లకు సైతం కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
కేంద్రం 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లకు వ్యాక్సిన్ ను ఇప్పటికే పంపిణీ చేసింది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోని వాళ్లు కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే నష్టపోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: Somu Veerraju: పవన్ కళ్యాణ్ యే సీఎం.. టీడీపీని డిఫెన్స్ లో పడేసిన సోము వీర్రాజు