
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాల్లో కొన్ని వైరస్ పై భయాన్ని తగ్గిస్తున్నాయి. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కరోనా రోగులు ఎవరైతే ఆస్పిరిన్ ను ఎక్కువగా తీసుకుంటారో వారికి ప్రాణాప్రాయం తక్కువని తేలింది. ఆస్పిరిన్ తీసుకున్న రోగుల్లో మరణాల ముప్పు ఏకంగా 47 శాతం తగ్గినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కరోనా నిర్ధారణ అయిన వాళ్లపై సైతం ఆస్పిరిన్ ట్యాబ్లెట్ అద్భుతంగా పని చేస్తోందని.. వీళ్లు ఐసీయూ లేదా వెంటిలేటర్లపై చేరేందుకు 40 శాతం కంటే అవకాశాలు ఉంటాయని తెలిపింది. 412 మంది కరోనా సోకిన రోగులపై యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. నాలుగు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందించి కీలక విషయాలను వెల్లడించారు.
అనస్తేషియా అండ్ అనల్గేషియా అనే జర్నల్ లో ఈ పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడే వాళ్లు ఎక్కువగా ఆస్పిరిన్ ను తీసుకుంటున్నారని.. వాళ్లకు మరణ ముప్పు తగ్గడంతో పాటు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఆస్పిరిన్ తీసుకునే వారిలో 43 శాతం మంది ఐసీయూలో చేరే అవకాశాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
అయితే ఈ అధ్యయన ఫలితాలను ధృవీకరించాల్సి ఉందని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఆస్పిరిన్ ను వైద్య్యుల పర్యవేక్షణలోనే వాడాలని దీర్ఘాకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు మాత్రం ఆస్పిరిన్ ను తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.