Ginger: చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే వాటి కంటే అనారోగ్యాన్ని (Health issues) ఇచ్చే వాటిని ఎక్కువగా తింటున్నారు. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్(Fast Foods), పాస్తా(Pasta), నూడిల్స్(Noodles) వంటి వాటిని చాలా మంది తింటున్నారు. వీటివల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యల (health Issues) బారిన పడుతున్నారు. అయితే మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంలో ఉండే అన్ని పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, కాపర్ వంటి పోషకాలు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే చాలా మంది అల్లం తీసుకోరు. జలుబు, దగ్గు వంటివి చేస్తేనే తీసుకుంటారు. అది కూడా టీలో మాత్రమే తీసుకుంటారు. అంతే కానీ డైరెక్ట్‌గా అల్లం తినరు. చేదుగా ఉండటంతో చాలా మందికి నచ్చదు. అయితే అల్లం డైరెక్ట్‌గా కాకుండా కాల్చి తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాల్చిన అల్లం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి కాల్చిన అల్లం తినడం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
రోగ నిరోధక శక్తి పెరుగుదల
కాల్చిన అల్లం డైలీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ కాల్చిన అల్లం తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు కడుపు సంబంధిత సమస్యలను క్లియర్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈజీగా బరువు తగ్గవచ్చు
కాల్చిన అల్లం తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఊబకాయంతో బాధపడుతున్న వారు కాల్చిన అల్లం తినడం వల్ల తొందరగా బరువు లాస్ అవుతారు. అలాగే కాల్చిన అల్లం మధుమేహం కూడా తగ్గిస్తుంది. అలాగే కీళ్ల సమస్యలు, దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా క్లియర్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అల్లం చారు
కొందరు నిరంతరంగా దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు కాల్చిన అల్లంతో చారు తయారు చేసుకుని తింటే సమస్యలన్నీ తగ్గుతాయి. వారానికి కనీసం రెండు రోజులు అయిన అల్లం చారు తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. చింతపండు చారు కంటే కాల్చిన అల్లంతో తయారు చేసిన చారును తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా కాల్చిన అల్లం కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.