అయితే కొన్ని పండ్లలో మాత్రం షుగర్ లెవెల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయని ఆ పండ్లను మాత్రం తినకుండా ఉంటేనే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అందరూ అమితంగా ఇష్టపడే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. అయితే మామిడి పండ్లలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మామిడి పండ్లలో ఏకంగా 45 శాతం చక్కెర ఉండటం గమనార్హం. ద్రాక్షలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది.
జ్యూస్, షేక్స్, వోట్ మీల్ ద్వారా ద్రాక్ష పండ్లను తీసుకుంటే మంచిది. ఒక కప్పు ద్రాక్ష పండ్లలో 23 గ్రాముల చక్కెర ఉంటుందని సమాచారం. ద్రాక్ష పండ్లను సాధారణ పరిమాణంలో తీసుకోవచ్చు. ఒక కప్పు చెర్రీస్‌లో 18 గ్రాముల చక్కెర ఉండగా చెర్రీస్‌ను మితంగా తింటే బెటర్ అని నిపుణులు చెబుతుండటం గమనార్హం. ఒక పియర్‌లో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. తక్కువ పరిమాణంలో తినాలనుకుంటే పియర్ ను తీసుకోవచ్చు.
పెరుగు, సలాడ్‌లో వేసుకుని పియర్ ను సులభంగా తీసుకోవచ్చు. మీడియం సైజ్ పుచ్చకాయలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. అయితే రెండు పుచ్చకాయల ముక్కల కంటే ఎక్కువ మొత్తం తీసుకోకూడదు. అరటి పళ్లలో 14 గ్రాముల చక్కెర ఉండగా ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో భాగంగా అరటిపళ్లను తీసుకోవచ్ఛు. ఒక అవోకాడోలో 1.33 గ్రాముల చక్కెర ఉండగా ఈ పండ్లను షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు.