Four Happy Hormones: మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు అని చాలామందికి తెలియదు. మరి ఆ నాలుగు ఏమిటో తెలుసా ?
1. ఎండార్ఫిన్స్,
2. డోపామైన్,
3. సెరిటోనిన్,
4. ఆక్సిటోసిన్.
ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది. ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం.
1. ఎండార్ఫిన్స్:
ముందుగా ఎండార్ఫిన్స్ ఏమి చేస్తోందో చూద్దాం. మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. రిలీజ్ అయిన ఇవి.. మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి. మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అలాగే నవ్వడం వలన కూడా ఈ ఎండార్ఫిన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. నవ్వడం ఒక భోగం – నవ్వలేకపోవడం ఒక రోగం” అన్నారుగా జంధ్యాల.
2. డోపామైన్:
డోపామైన్ అనేది చిన్న చిన్న ఆనందం కలగడానికి కారణం అవుతుంది. వివిధ స్థాయిలలో మనలో డోపామైన్ హార్మోను ను విడుదల అవుతాయి.
Also Read: ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇదొక్కటే పరిష్కారం !
3. సెరిటోనిన్:
మనం ఎప్పుడైనా ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఈ సెరిటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మనం మంచి చేశాం అనే ఫీలింగ్ ను మనలో బిల్డ్ చేస్తోంది. దాంతో మనకు గొప్ప సంతృప్తి దొరుకుతుంది. అలాగే ఈ సెరిటోనిన్ కారణంగానే.. మనం రక్త దానం, అనాధ ప్రేత సంస్కారం, అనాధలకు సేవ, యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ లాంటివి చేస్తుంటాం.
4. ఆక్సిటోసిన్:
ఈ ఆక్సిటోసిన్ అనేది.. రిలేషన్ బిల్డ్ చేసే హార్మోన్. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను అన్నమాట. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది. కాబట్టి అనుబంధాలను పెంచుతుంది ఇది .
Also Read: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే 2.8 లక్షల కొత్త కేసులు.. పెరుగుతున్న మరణాలు!