Fertility Tests: ప్రస్తుత కాలంలో పురుషులు, మహిళలు సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారం వంటి కారణాల వల్ల ఎక్కువ శాతం మంది ఈ సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారు. మన అలవాట్లు, తినే ఆహారం వంటివే మన ఫెర్టిలిటీని నిర్ణయిస్తుంది. కొందరు మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల పురుషులే కాదు.. మహిళలు కూడా ఫెర్టిలిటీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి అయ్యి ఏళ్లు గడుస్తున్న కూడా పిల్లలు పుట్టడం లేదు. అయితే ఒక్కోరి ఫెర్టిలిటీ ఒక్కోలా ఉంటుంది. పెళ్లి అయి ఎక్కువ నెలల గడుస్తున్న పిల్లలు పుట్టకపోతే కొందరు డాక్టర్‌ను సంప్రదించి ఫెర్టిలిటీ టెస్ట్‌లు చేయించుకుంటారు. అసలు ఫెర్టిలిటీ టెస్ట్‌లు ఎలా చేయించుకుంటారు? పురుషులకు మహిళలకు ఒకే రకమైన ఫెర్టిలిటీ టెస్ట్‌లు ఉంటాయా? లేకపోతే వేర్వేరుగా టెస్ట్‌లు చేయించుకుంటారా? అనే పూర్తి విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
మహిళలకు ఈ టెస్ట్‌లు..
మహిళలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఫెర్టిలిటీని టెస్ట్ చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్తున్నారు. అయితే మహిళలకు ముందుగా పీరియడ్స్ గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి? పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు అయిన ఉన్నాయా? గర్భనిరోధక మాత్రలు ఎప్పుడైనా వేసుకున్నారా? అనే విషయాల గురించి పూర్తిగా వైద్యులు అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అండం విడుదల గురించి టెస్ట్ చేస్తారు. మహిళ శరీరంలో ఎన్ని అండాలు ఉన్నాయి? హార్మోన్ల ప్రభావం ఎంత వరకు ఉందనే విషయాలు కూడా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత పెల్విస్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ (సోనోగ్రామ్), డయాగ్నోస్టిక్ సర్జరీ (లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ) అనే రెండు టెస్ట్‌లు చేస్తారు. వీటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా వారికి వైద్యులు చికిత్స అందిస్తారు.
పురుషులకు ఏ టెస్ట్‌లు అంటే?
పురుషుల్లో ఫెర్టిలిటీ టెస్ట్ కోసం ముందు సిమెన్ అనాలిసిస్ చేస్తారు. పురుషుల స్మెర్మ్ శాంపి తీసుకుని అవి నాణ్యతగా ఉన్నాయా? లేదా? కౌంట్ ఎలా ఉందని చెక్ చేస్తారు. ఆ తర్వాత యూరిన్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేస్తారు. కొందరికి వీర్యం బయటకు వెళ్లకుండా మూత్రంలో ఉండిపోతుంది. దీన్ని గుర్తించడానికి యూరినాలైసిస్ లేదా టెస్టిక్యులర్ అల్ట్రాసోనోగ్రఫీ టెస్ట్ చేస్తారు. వీటిలో రిజల్ట్స్ వచ్చిన ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు. అయితే ఒక్కోరి బట్టి ఒక్కోరి చికిత్స ఇస్తారు. ఇలా రక్త పరీక్ష, ఇమేజింగ్ టెస్ట్, సెమెన్ టెస్ట్, యూరిన్ వంటివి చేస్తారు. వీటిలో ఫలితాలు వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తున్నారో అనే విషయాలు గురించి కూడా డాక్టర్లు అడిగి తెలుసుకుంటారు. దాని బట్టి వైద్యులు ఫెర్టిలిటీ చికిత్సలు చేస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.