
మనలో చాలామందికి బరువు తగ్గాలని ఉన్నా బరువు తగ్గడానికి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేరు. అయితే జీలకర్ర నీటితో సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గించడంలో జీలకర్ర నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. బరువు తగ్గాలని భావించే వాళ్లు గ్లాస్ నీటిలో టీ స్పూన్ జీలకర్రను నానబెట్టాల్సి ఉంటుంది. రోజూ ఆహారం తీసుకునే సమయంలో జీలకర్ర నీటిని తీసుకోవడం ద్వారా సులువుగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: కీళ్ల నొప్పులకు సులువుగా చెక్ పెట్టే ఆహార పదార్థాలివే..?
ఫైబర్ ఎక్కువగా ఉండే జీలకర్ర నీరును ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే తీసుకుంటే మంచిది. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో జీలకర్ర నీరు సహాయపడుతుంది. కాలేయంలోని వ్యర్థాలను తొలగించడంలో జీలకర్ర నీరు ఎంతగానో సహాయపడుతుంది. జీలకర్ర నీరు జీర్ణ వ్యవస్థను చురుకుగా చేయడంతో పాటు తినే ఆహారం కొవ్వులా పేరుకుపోకుండా చేయడంలో తోడ్పడుతుంది.
జీలకర్ర నీరు శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యను దూరం చేస్తుంది. ఆహారం పేగుల్లోనే ఉండిపోతే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. జీలకర్ర నీళ్లు తాగితే ఆహారం జీర్ణం కావడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు వేగంగా దూరమవుతాయి. శరీరంలోని చెడు కొవ్వును జీలకర్ర నీరు సులభంగా కరిగిస్తుంది.
Also Read: నీళ్లలో ఇంగువ పౌడర్ కలిపి తాగితే ఇన్ని ప్రయోజనాలున్నాయా.?
బరువు తగ్గాలని భావించే వాళ్లకు బరువు తగ్గడానికి జీలకర్ర నీరు ఎంతగానో తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి గట్టిగా ప్రయత్నాలు చేసేవాళ్లు ఈ విధంగా చేస్తే మంచిది. శరీరంలో చెడుకొవ్వు కరిగేలా చేసి జీలకర్ర నీళ్లు శరీర బరువును తగ్గిస్తాయి.
Comments are closed.