Fake Watermelon: ప్రస్తుతం ఆహారం కాదు ఫ్రూట్స్ తినాలి అంటే కూడా భయం వేస్తుంది. అన్నింటిలో కల్తీ చేస్తున్నారు. ప్రతిపదార్థం కల్తీ అవుతుంది. ఈ కల్తీ పదార్థాలను గుర్తించలేక వాటిని తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రజలు. ఇక ఆరోగ్య నిపుణులు, ఎక్స్ పర్టులు, ఫుడ్ ఆపీసర్లు ఉన్నా కూడా ఇలాంటి విషయాల గురించి తెలుసుకోలేకపోతున్నారు. మరి వేసవి సీజన్ వచ్చిందంటే ఎక్కువగా గుర్తు వచ్చే ఫ్రూట్స్ మామిడి, వాటర్ మిలన్. మరి ఈ వాటర్ మిలన్ లో కూడా కల్తీ అవుతున్నాయి? వాటిని ఎలా గుర్తించడమో ఓ సారి తెలుసుకుందాం.
లోపల ఉండే ఫ్రూట్స్ ను ఎలా కల్తీ చేస్తున్నారు అనుకుంటున్నారా? అవును ఈ వాటర్ మిలన్ కూడా కల్తీ అవుతుంది. అదేనండి పుచ్చకాయ కల్తీ అవుతుంది. దీనికి మంచి రంగును ఇవ్వడానికి వాటర్ మిలన్ కు ఇంజక్షన్ లు ఇస్తున్నారు. వీటి వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయట. దీని వల్ల ఫుడ్ పాయిజన్ తో పాటు కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉందట. మరి మీరు కొన్న వాటర్ మిలన్ కల్తీ దా? మంచిదా అనే విషయం తెలుసుకోవడం ఎలా అంటే..
వాటర్ మిలన్ లోపల బ్రైట్ రెడ్ కలర్ కనిపిస్తే ఎథ్రోసిన్ బి, లేదా రెడ్ బి అనే డై ని ఇంజెక్ట్ చేస్తారు. ఈ కెమికల్స్ కలిపిన వాటర్ మిలన్ ను తినడం వల్ల కడుపు నొప్పి, తలనొప్పి, స్కిన్ రాషెస్, లంగ్స్, నరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. వాటర్ మిలన్ నుంచి ఒక ముక్కను కట్ చేసి.. కొన్ని నీటిలో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత ఆ నీటిలో కలర్ కనిపిస్తే అది పక్కా కల్తీది అని నిర్ధారణకు రావచ్చు.
కట్ చేసిన వాటర్ మిలన్ మీద ఒక దూదితో రుద్దితే ఆ దూదికి కలర్ అంటుకుంటే మీరు తెచ్చిన వాటర్ మిలన్ కల్తీది అని గమనించండి. డబ్బులు వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ఇలాంటి వాటర్ మిలన్స్ ను తినకండి. తిన్న తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలకు మరింత డబ్బులు వెచ్చించాలి అని గుర్తు పెట్టుకోండి.