Health Tips: మనలో కొంతమంది ప్రతిరోజూ స్నానం చేయడానికి అస్సలు ఇష్టపడరు. రోజూ స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది పని ఒత్తిడి వల్ల, బద్ధకం వల్ల స్నానం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు. స్నానం చేయకపోవడం వల్ల కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెప్పినా కొంతమంది అస్సలు పట్టించుకోరు. అయితే రోజూ స్నానం చేయని వాళ్లు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
కాలాలతో సంబంధం లేకుండా స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎవరైతే ప్రతిరోజు స్నానం చేయకుండా స్నానం విషయంలో అశ్రద్ధ వహిస్తారో వాళ్ల శరీరంపై బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్నానం చేయకపోవడం వల్ల అలర్జీలు రావడం పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: Jr NTR: చిరంజీవి ఎవరో నాకు తెలియదు అన్న ఎన్టీఆర్ కి నాగార్జున ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా ?
ఒకవేళ ఏదైనా కారణం వల్ల స్నానం చేయడం కుదరకపోతే మాత్రం కొన్ని శరీర భాగాలను తప్పనిసరిగా శుభ్రం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. స్నానం చేయకపోయినా మన పాదాలను తప్పనిసరిగా శుభ్రం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సాక్సులు ధరించినా దుర్వాసన వచ్చే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.
చెమట ఎక్కువగా పట్టేవాళ్లు ప్రతిరోజూ కచ్చితంగా చంకలను శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేయనివారికి చంకల్లో బ్యాక్టీరియా పేరుకుపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల తప్పనిసరిగా చంకలను శుభ్రం చేసుకుంటే మంచిది. రోజూ స్నానం చేయలేని వాళ్లు లోదుస్తులను తప్పనిసరిగా మార్చుకోవడంతో పాటు గజ్జల ప్రాంతాన్ని గోరువెచ్చని నీళ్లు, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ప్రైవేట్ పార్ట్స్ ను శుభ్రం చేసుకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా శరీరంపై ఉండదు. స్నానం చేయకపోయినా చెవుల వెనుక, మెడ వెనుక భాగాలతో పాటు చేతివేళ్లను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి.
Also Read: Pawan Kalyan Somu Veeraju: పవన్ సీఎం అభ్యర్థి.. సోము వీర్రాజు బౌలింగ్ కు టీడీపీ ఔట్?