https://oktelugu.com/

Corona Virus:  కరోనా సోకిన వాళ్లకు మరో షాక్.. గుండెల్లో అలాంటి సమస్యలు!

Corona Virus: ఈ మధ్య కాలంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా మరణించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 50 సంవత్సరాలకు అటూఇటుగా ఉన్నవాళ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మరణిస్తుండటం గమనార్హం. ఇలా మరణిస్తున్న వాళ్లలో చాలామంది గతంలో కరోనా వైరస్ సోకిన వాళ్లు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లకు కరోనా సోకితే వాళ్లు కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 6, 2022 9:24 am
    Follow us on

    Corona Virus: ఈ మధ్య కాలంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా మరణించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 50 సంవత్సరాలకు అటూఇటుగా ఉన్నవాళ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మరణిస్తుండటం గమనార్హం. ఇలా మరణిస్తున్న వాళ్లలో చాలామంది గతంలో కరోనా వైరస్ సోకిన వాళ్లు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లకు కరోనా సోకితే వాళ్లు కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    బ్రెయిన్‌ స్ట్రోక్‌కు, హార్ట్‌ స్ట్రోక్‌ కు కరోనా ఇన్ఫెక్ష ప్రమాద సూచిక అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకు కరోనా సోకితే బ్రెయిన్, హార్ట్‌ స్ట్రోక్స్‌ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. కరోనా నుంచి కోలుకున్నా వేర్వేరు అవయవాలపై వైరస్ ప్రభావం అయితే పడుతుందని చెప్పవచ్చు.

    కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొందరిలో ఇప్పటివరకు గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా గుండె వేగంగా కొట్టుకుని గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడంతో కూడా కొంతమందిలో సమస్యలు తలెత్తుతున్నాయి. పలు అధ్యయనాలలో కరోనా సోకని వాళ్లతో పోల్చి చూస్తే కరోనా సోకిన వాళ్లకే హార్ట్‌ స్ట్రోక్, బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎక్కువగా వస్తున్నాయి. కరోనా సోకిన వాళ్లలో రక్తం చిక్కబడుతుంది.

    కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. గుండె ధమనులలో రక్తం గడ్డకట్టినా, అవరోధాలు ఏర్పడినా గుండెపోటు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లకు కరోనా సోకితే మాత్రం మరింత అప్రమత్తంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.