https://oktelugu.com/

Health Tips : విటమిన్ డి ఎక్కువ తీసుకుంటే జరిగేది ఇదే..

ఆరోగ్యనిపుణుల ప్రకారం విటమిన్‌ డి శరీరానికి మేలు చేస్తుంది. కానీ విటమిన్‌ డి సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా నష్టం వాటిల్తుతుంది అంటున్నారు ఆరోగ్యానిపుణులు. మరి విటమిన్ డి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.

Written By: , Updated On : October 13, 2024 / 10:32 PM IST
Health Tips

Health Tips

Follow us on

Health Tips :  ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం చాలా అవసరం. పోషకాహారం తీసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. మారుతున్న జీవనశైలి వల్ల ఈ జాగ్రత్త మరింత ఎక్కువ అవసరమే అని చెప్పాలి. లేదంటే కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మన శరీరానికి విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సడెంట్లు ఎంతో అవసరం. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది విటమిన్‌ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో విటమిన్ మందులను సూచిస్తున్నారు వైద్యులు.

విటమిన్ మందుల్లో ముఖ్యంగా విటమిన్‌ డి కూడా ఉంటుంది.. అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం విటమిన్‌ డి శరీరానికి మేలు చేస్తుంది. కానీ విటమిన్‌ డి సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా నష్టం వాటిల్తుతుంది అంటున్నారు ఆరోగ్యానిపుణులు. మరి విటమిన్ డి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.

అధిక విటమిన్ డి వల్ల ఎముకలు బలహీనపడటం, ఎముకల నొప్పి, ఎముకల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. అలాగే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ తెలత్తుతాయి. గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్‌ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక స్థితితో కొన్ని మార్పులు కలుగుతాయి. మతిమరుపు వంటి సమస్యలు కలుగుతాయి. అంతేకాదు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కండరాల బలహీనత వంటి సమస్యలతో బాధ పడాల్సిందే అంటున్నారు నిపుణులు.

విటమిన్‌ డి శరీరానికి కావాల్సిన అంతగా తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు ప్రతిరోజూ ఎక్కువ విటమిన్ డిని తీసుకుంటారు. కొన్ని ఆహార పదార్థాల్లో ఇది ఎక్కువ ఉంటుంది. తెలియకుండా తింటే విటమిన్ డి ఎక్కువ అవుతుంది. సో ఇలా ఎక్కువగా నెలల తరబడి తీసుకుంటే శరీరం విషపూరితం అవుతుంది. కేవలం పెద్దలకు రోజుకు 600 ఐయు విటమిన్ డి తీసుకుంటే సరిపోతుంది.

విటమిన్ డి మోతాదు లక్షణాలు:

ఆకలి: విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. దీని వల్ల వికారం, వాంతులు, బలహీనత, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కండరాల బలహీనత: విటమిన్ డి లోపం వల్ల కండరాలు బలహీనపడి, అలసట గా అనిపిస్తుంటుంది.

ప్రేగు కదలికలు: విటమిన్‌ డి ఎక్కువగా తీసుకుంటే జీర్ణవ్యస్థత దెబ్బతింటుంది. దీనివల్ల కాల్షియం కార్బొనేట్ అధికంగా అవుతుంది. తద్వారా ప్రేగు కదలికలకు తగ్గిపోతాయి.

గాయాలు: చిన్న గాయాలు కూడా నెమ్మదిగా మానుతాయి. అంటే విటమిన్ డి మోతాదు సంకేతంగా అనుకోవాలి.

డిప్రెషన్: విటమిన్ డి మోతాదు మూడ్ స్వింగ్స్, నిరాశ, ఆందోళన మానసిక అస్వస్థతలకు దారితీస్తుంది.

కేశాలు రాలడం: విటమిన్ డి మోతాదు కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి, అవి రాలడానికి కారణమవుతుంది.

గుండె పోటు: విటమన్‌ డి ఎక్కువగా తీసుకుంటే గుండె నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..