https://oktelugu.com/

Paracetemol:  పారాసెటమాల్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్!

Paracetemol:  ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో మనుషులను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయనే సంగతి తెలిసిందే. జలుబు లేదా జ్వరం సమస్యలు వేధిస్తుంటే చాలామంది పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వాడతారు. వైద్యులు సైతం పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వాడాలని సూచనలు చేస్తూ ఉంటారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సొంతంగా పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వాడవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ట్యాబ్లెట్లు మోతాదుకు మించితే ప్రాణాలకే ప్రమాదం అని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను వేసుకున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 21, 2022 / 07:53 AM IST
    Follow us on

    Paracetemol:  ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో మనుషులను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయనే సంగతి తెలిసిందే. జలుబు లేదా జ్వరం సమస్యలు వేధిస్తుంటే చాలామంది పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వాడతారు. వైద్యులు సైతం పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వాడాలని సూచనలు చేస్తూ ఉంటారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సొంతంగా పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వాడవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

    Paracetemol

    ఈ ట్యాబ్లెట్లు మోతాదుకు మించితే ప్రాణాలకే ప్రమాదం అని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను వేసుకున్న తర్వాత మళ్లీ ఆరు గంటల వరకు ట్యాబ్లెట్ ను వేసుకోకూడదు. చిన్నపిల్లలకు వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను వేసుకున్న మూడు గంటల్లోనే మళ్లీ ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    Also Read: నకిలీ మందుల గురించి తెలుసుకోవాలంటే ఇలా స్కాన్ చేస్తే చాలు..!

    జ్వరం, తలనొప్పి, పీరియడ్స్ నొప్పి, ఒళ్లు నొప్పులు, మైగ్రేన్, ఇతర ఆరోగ్య సమస్యలకు పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వాడినా జ్వరం తగ్గని పక్షంలో వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. బరువు తక్కువగా ఉన్నవాళ్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోకుండా పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను తీసుకోకూడదు.

    మోతాదుకు మించి పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు వేర్వేరు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సొంత వైద్యం ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    Also Read: కరోనా మందులు ఎలా వాడాలో తెలుసా.. వాటి వల్ల కలిగే దుష్పరిమాణాలివే?