Homeహెల్త్‌Encephalitis Lethargica Epidemic: స్పృహలో ఉన్నా కదల్లేరు.. ఏకంగా ఐదు లక్షల మంది చనిపోయారు.. ఏమిటి...

Encephalitis Lethargica Epidemic: స్పృహలో ఉన్నా కదల్లేరు.. ఏకంగా ఐదు లక్షల మంది చనిపోయారు.. ఏమిటి ఈ వ్యాధి.. ప్రపంచం ఎందుకు వణికిపోయింది..

Encephalitis Lethargica Epidemic: ప్రస్తుతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. గుండెను తీసి గుండెను పెడుతున్నారు. జీవన్మరణం పొందిన వారి నుంచి అవయవాలు తీసి.. వేరే వాళ్లకు అమర్చుతున్నారు. ఒక మనిషికి ఎలాంటి వ్యాధులు వచ్చినా సరే.. కాపాడగలిగే స్థాయికి వైద్య పరిజ్ఞానం ఎదిగింది.

కొన్ని దశాబ్దాల క్రితం ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ముఖ్యంగా వైద్య పరిజ్ఞానం అంతంతమాత్రంగానే ఉండేది. ఫలితంగా రోగాలు వచ్చినవారు కన్నుమూసేవారు. రోగాల నిర్ధారణ కూడా సక్రమంగా జరిగేది కాదు. కొన్ని సందర్భాలలో రోగాలను నిర్ధారించే సమయం నాటికే.. వ్యాధులు సోకినవారు చనిపోయేవారు. అటువంటి ఒక మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది. ఏకంగా 5 లక్షల మందిని బలి తీసుకుంది.

ప్రపంచంలో 1917 నుంచి 1930 కాలంలో Encephalitis lethargica అనే వింత వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధి వల్ల రోగులు స్పృహలో ఉన్న కదలలేరు. కనీసం మాట్లాడలేరు. బతికి ఉన్నప్పటికీ శవాలుగానే ఉండిపోతారు. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోతారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా నాటి కాలంలో ఐదు లక్షల మంది చనిపోయారు. వైద్య శాస్త్రానికి అత్యంత సవాల్ విసిరిది ఈ వ్యాధి. ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకు తగ్గిపోయిందో కూడా తెలియదు. ఇప్పటికి అంతు చిక్కని రహస్యంగా ఈ వ్యాధి ఉంది. ఈ వ్యాధిపై 1990లో హాలీవుడ్లో Awakenings అనే పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా హాలీవుడ్ చరిత్రలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా చూస్తూ చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు. కొందరైతే ఆ సినిమా పూర్తిగా చూడలేక థియేటర్లనుంచి బయటికి పరుగులు తీశారు.

ఈ ప్రపంచాన్ని కలరా, మశూచి వంటి వ్యాధులు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ప్రజలు లక్షల సంఖ్యలో చనిపోయారు. వైద్య విధానం అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. అప్పట్లో ఈ ఇంత వ్యాధి చాలామంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే వైద్య పరిజ్ఞానంలో ఈ వ్యాధి నివారణకు ఎటువంటి చికిత్సను అందుబాటులోకి తీసుకురాలేదు. కాకపోతే 13 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెట్టిన ఈ వ్యాధి.. ఆ తర్వాత తగ్గిపోవడం ఒక విధంగా ఆశ్చర్యకరం. ఈ వ్యాధి ఎలా తగ్గింది.. ప్రజల్లో ఉన్నట్టుండి వ్యాధి నిరోధకత ఎలా పెరిగింది.. అనే అంశాలపై ఇప్పటికి క్లారిటీ లేదు. కాకపోతే వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే బతికి ఉండగానే శవంలాగా మారిపోవడం ఏ మనిషికీ ఇష్టం ఉండదు. దాదాపు 5 లక్షల మందిని బలి తీసుకుందంటే.. ఈ వ్యాధి తీవ్రత నాటి రోజుల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular