Egg Coffee: కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఆహార పదార్థాలు పుట్టుకొస్తున్నాయి. ఒక రకంగా ఇవి రుచిగా బాగానే ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం హాని చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ‘ఎగ్ కాఫీ’ అనే కొత్త ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. సాధారణ టీ కంటే ఇది ఎంతో రుచిగా ఉంటుందని కొందరు కొనియాడుతున్నారు. ఈ కాఫీ తయారీలో పచ్చి కోడిగుడ్డు సొనను కలిపి తాగుతున్నారు. ఈ ప్రత్యేక రుచి చాలామందిని ఆకర్షిస్తోంది. కానీ దీని వల్ల ఆరోగ్యానికి ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆ సమస్యలు ఏవో చూద్దాం..
కాఫీలో పచ్చి గుడ్డు ఉపయోగించడం వల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్య సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఇన్ఫెక్షన్. ఇది గుడ్డు సొనలో ఎక్కువగా ఉంటుంది. ఈ బాక్టీరియా శరీరంలోకి వెళితే వాంతులు, డయేరియా, జ్వరంలాంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.పచ్చి గుడ్డు అందరికీ సులభంగా జీర్ణం కావడం లేదు. కొందరికి ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు కలిగించవచ్చు. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ డ్రింక్‌ను తీసుకోవడం తప్పించుకోవడం మంచిది.
ఎగ్ కాఫీలో సాధారణంగా షుగర్, కండెన్స్డ్ మిల్క్ ఎక్కువగా వాడుతారు. ఇవి కలిసి అధిక క్యాలరీలను అందిస్తాయి. తరచుగా తీసుకుంటే బరువు పెరగడం, కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గుడ్డు సొనలో కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిని కాఫీతో కలిపి తరచూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోవాల్సినవారు దీన్ని దూరంగా ఉంచాలి.
గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ‘ఎగ్ కాఫీ’ తాగేముందు ప్రత్యేకంగా జాగ్రత్తపడాలి. వీరికి పచ్చి గుడ్డు వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉంటుంది. ఎగ్ కాఫీ తాగాలనిపిస్తే పచ్చి గుడ్డు బదులుగా బాగా ఉడికించిన గుడ్డు లేదా పాస్చరైజ్డ్ ఎగ్ ప్రోడక్ట్స్ వాడడం మంచిది. అలాగే షుగర్ తగ్గించి తీసుకోవడం ద్వారా కొంతవరకు ఆరోగ్య రిస్క్ తగ్గించుకోవచ్చు.
ఎగ్ కాఫీకి రుచిగా ఉన్నా.. ఆరోగ్యపరంగా సేఫ్‌గా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో దీనికి ప్రత్యామ్నాంగా ఇతర కాఫీలను తాగి ఆస్వాదించవచ్చు. వీటిలో మిల్క్ కాఫీ ఒకటి. సాధారణంగా కాఫీకి పాలు కలిపి తాగడం బెస్ట్ ఆప్షన్. ఇది సాఫ్ట్ టెక్స్చర్ ఇస్తుంది, అలాగే ప్రోటీన్, కాల్షియం కూడా అందుతాయి. చక్కెరను తగ్గిస్తే ఇంకా హెల్తీగా ఉంటుంది. అలాగే కోల్డ్ కాఫీ విత్ ఫ్రోత్ బ్లెండర్లో కాఫీ, చల్లని పాలు, కొద్దిగా ఐస్ వేసి ఫ్రోత్ వచ్చేలా బ్లెండ్ చేస్తే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇది ఎగ్ కాఫీలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది కానీ సేఫ్. ప్రోటీన్ కాఫీ జిమ్ చేసే వాళ్లు ఎక్కువగా తీసుకోవచ్చు. కాఫీలో వె ప్రోటీన్ లేదా ప్లాంట్ ప్రోటీన్ పొడి కలిపితే టేస్ట్‌తో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. పచ్చి గుడ్డు అవసరం ఉండదు.