Veedhi Potu Effects: మనదేశంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇల్లు కొనాలన్నా, ఇంటి స్థలం కొనుగోలు చేయాలన్నా వాస్తును నమ్ముతుంటారు. ఏ ఇల్లునైతే కొనుగోలు చేస్తున్నామో దానికి వాస్తు ఉందా లేదా అనేది పరిశీలించుకుంటారు. ఇల్లు కట్టుకునే క్రమంలో మనం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీధిపోట్ల వ్యవహారం గురించి ప్రధానంగా దృష్టి కేంద్రీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం కొన్ని వీధిపోట్లు మనకు మంచి చేస్తాయి కొన్ని మాత్రం చెడు ఫలితాలు అందిస్తుంటాయి.
మనకు కీడు చేసే వీధిపోట్లలో తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం వీధిపోట్లు ఉన్న ఇళ్లను అసలు కొనుగోలు చేయకూడదు ఈ వీధిపోట్లు ఉంటే మనకు అనర్థాలు చోటుచేసుకుంటాయి. ఈ వీధిపోట్లు ఉన్న స్థలాలను కొనుగోలు చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో పశ్చిమ నైరుతి వీధి పోటు వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పశ్చిమ నైరుతి వీధిపోటు ఉన్న స్థలం కొనుగోలు చేస్తే అపజయాలే వేధిస్తాయి. మనశ్శాంతి లోపిస్తుంది. ఇంట్లో ఎప్పుడు నిరాశకు గురవుతుంటారు.
ఇలాంటి ఇంటిలో ఉంటే పురుషులకు బయట అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అనవసర నిందలు పడే అవకాశాలు వస్తాయి. ఇలాంటి వీధిపోటు ఉంటే పరిస్థితి అధ్వానంగా మారుతుంది. ఆర్థికంగా నష్టాలు పలకరిస్తాయి. ఎంత కష్టపడినా జీవితంలో ఎదగడం కష్టమే. ఇలాంటి వీధిపోటు ఉంటే పొరపాటున కూడా కొనుగోలు చేయడం మానుకుంటే మంచిది. ఇంటిల్లిపాది ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఎదుగుబొదుగు ఉండదు. సుఖసంతోషాలకు దూరమవుతారు.
పశ్చిమ నైరుతి వీధిపోటు వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయని తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో పశ్చిమ నైరుతి వీధిపోటు ఉండకుండా చూసుకోవాలి. వీధిపోటు ప్రభావంతో ఎన్నో నష్టాలు సంభవిస్తాయి. ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం కొనుగోలు చేయాలన్నా అన్ని రకాలుగా పరిశీలించుకుని ముందుకు రావాలి. తక్కువ ధర అని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పశ్చిమ నైరుతి వీధిపోటు ఉన్న ఇల్లును కొనకూడదని నిర్ణయించుకుంటే మంచిది.