భూమిపై నివశించే మానవులకు నీరు జీవనాధారం అనే సంగతి తెలిసిందే. ఆరోగ్యంగా జీవించాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. అలసట, నీరసం ఉన్నవాళ్లు నీళ్లు తాగితే తక్కువ సమయంలో ఎనర్జీని పొందే అవకాశం ఉంటుంది. శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణానికి నీరు అవసరం అవుతుంది. మీ శరీరంలోని కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయంటే మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదని భావించాలి.
Also Read: మొక్కజొన్న తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
మన శరీరంలో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో నీటికి కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. రోజుకు కనీసం 10 గ్లాసుల నుంచి 12 గ్లాసుల నీటిని తాగడం వల్ల శరీరానికి సరిపడా నీరు అందుతుంది. హైబీపీ సమస్య వచ్చినా, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతున్నా, అలర్జీలు, చర్మంపై ముడతలు, మచ్చలు వస్తున్నా మలబద్ధకం సమస్య వేధిస్తున్నా నీళ్లు తక్కువగా తాగుతున్నామని భావించాలి.
Also Read: గోరు చిక్కుడు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
తరచూ అలసటకు గురవుతున్నారంటే నీళ్లు తక్కువగా తాగుతున్నట్టు భావించాలి. నీళ్లు తక్కువగా తాగితే జీర్ణసంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువగా యూరినేషన్ కు వెళుతున్నా, శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నా నీళ్లు తక్కువగా తాగుతున్నట్టు భావించాలి. శరీరానికి సరిపడా నీరు తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. మంచి నీళ్లు నాడీ వ్యవస్థను శుభ్రం చేయడంతో పాటు రక్త ప్రసరణను పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే బ్యాక్టీరియాలను తొలగించడంలో నీళ్లు సహాయపడతాయి.