దేశంలో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా చాలామంది చిరుతిండ్లకు అలవాటు పడుతున్నారు. చిరుతిండ్ల వల్ల దంత సంబంధిత వ్యాధులతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పండ్లను సరిగ్గా శుభ్రపరచుకోకపోవడం, తీపి పదార్థాలు తినడం వల్ల చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. తీపి పదార్థాలు ఎక్కువగా తింటే పంటిపై గారలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది.
ఆ తర్వాత పంటిపై ఎనామిల్ పాడయ్యే అవకాశంతో పాటు పంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పంటి నొప్పికి సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో వెల్లుల్లి, లవంగంను పేస్ట్ లా చేసుకుని ఉంచితే దీర్ఘకాలిక పంటి నొప్పి తగ్గడంతో పాటు పంటినొప్పికి తక్కువ సమయంలోనే ఉపశమనం లభిస్తుంది. లవంగాన్ని పంటి నొప్పి ఉన్నచోట నాలుగైదు గంటల పాటు ఉంచితే కొంచెం తిమ్మిరి కలిగి తర్వాత నొప్పి మాయమవుతుంది.
టవల్ పైన విక్స్ లేదా అమృతాంజన్ ను రాసి పంటి నొప్పి ఉన్న దవడ ప్రాంతంలో ఉంచితే పంటినొప్పి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. గోధుమ గడ్డి రసం ఉపయోగించి కూడా దంత శుద్దికి, పంటి నొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు. దంత క్షయాన్ని నొప్పిని నివారించడంలో గోధుమ గడ్డి రసం ఉపయోగపడుతుంది. పంటి నొప్పి ఉండే భాగంలో ఐస్ క్యూబ్ పెట్టడం ద్వారా కూడా పంటినొప్పికి చెక్ పెట్టవచ్చు.
మిరియాల పొడిని దంత మంజన్ లా పళ్లపై ఉపయోగించినా పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయను మూడు నిమిషాలు నమిలితే కూడా పంటినొప్పికి సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పంటినొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. రోజుకు రెండు పూటలా బ్రష్ చేసుకోవడం వల్ల దంత సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు.