Tea: టీతో పాటు ఇవి తింటే అనర్థాలే తెలుసా?

Tea: మనలో చాలా మందికి టీ తాగే అలవాటుంటుంది. దీంతో ఉదయం నిద్ర లేచింది మొదలు టీ తాగనదిదే దినచర్య మొదలు కాని వారున్నారంటే అతిశయోక్తి కాదు. టీకి ఎంతో మంది ఆకర్షితులయ్యారు. ఆంగ్లేయులు చేసిన అలవాట్లలో టీ ఒకటి. దీని వల్ల మనకు లాభం లేకపోయినా దాన్ని తాగేందుకు అందరు మొగ్గు చూపడం సహజమే. ఇంకా కొందరికేమో విచిత్రంగా టీ తాగకపోతే తలనొస్తుందని చెబుతారు. ఇలా టీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. టీతో పాటు […]

Written By: Srinivas, Updated On : April 18, 2023 4:15 pm
Follow us on

Tea

Tea: మనలో చాలా మందికి టీ తాగే అలవాటుంటుంది. దీంతో ఉదయం నిద్ర లేచింది మొదలు టీ తాగనదిదే దినచర్య మొదలు కాని వారున్నారంటే అతిశయోక్తి కాదు. టీకి ఎంతో మంది ఆకర్షితులయ్యారు. ఆంగ్లేయులు చేసిన అలవాట్లలో టీ ఒకటి. దీని వల్ల మనకు లాభం లేకపోయినా దాన్ని తాగేందుకు అందరు మొగ్గు చూపడం సహజమే. ఇంకా కొందరికేమో విచిత్రంగా టీ తాగకపోతే తలనొస్తుందని చెబుతారు. ఇలా టీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. టీతో పాటు కొన్ని ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుందని గుర్తించాలి.

టీ తాగేటప్పుడు ఘాటు పదార్థాలు తీసుకోకూడదు. దీంతో వాటి రంగు రుచి వాసనను టీ డామినేట్ చేస్తుంది. దీంతో అవి రుచిని ఇవ్వవు. అందుకే స్పైసీ ఫుడ్స్, మిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి వాటితో చేసిన ఆహారాలు తీసుకోవడం అంత మంచిది కాదు. టీ తాగే సమయంలో వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

టీ సేవించేటప్పుడు సిట్రస్ పండ్లు తీసుకోవడం కూడా సరికాదు. ఇందులో ఉండే ఆమ్లత్వంతో ఇబ్బందులొస్తాయి. సిట్రస్ పండ్లు అంటే పుల్లగా ఉండే పండ్లు. టీ తాగే సమయంలో వీటిని తీసుకోవడం వల్ల అందులో ఉండే కాటెచిన్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఇలా మనం టీ తాగేటప్పుడు ఏది పడితే అది తినడం అంత మంచిది కాదని తెలుసుకోవాలి.

Tea

టీ తోపాటు పాలు, పాల పదార్థాలు తీసుకోకూడదు. ఇలా చేస్తే ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. బ్లాక్ టీకి ఇలాంటి నిబంధనలు ఏమి ఉండకపోయినా దాంతో పాటు ఇవి తీసుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవని చెబుతారు. మామూలు టీతో పాటు మాత్రం వీటిని తీసుకోకపోవడమే బెటర్. టీతో మనం చాలా వాటిని తీసుకోవద్దు.

టీ తాగేటప్పుడు కేకులు, బిస్కట్లు, స్వీట్లు కూడా తినకూడదు. వీటిలో ఎక్కువ చక్కెర ఉంటుంది. దీని వల్ల మన శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే టీ తీసుకునే సమయంలో ఇలాంటి వాటి జోలికి వెళ్లకోవడమే మంచిది. ఇవి ఇతర అనారోగ్య కారణాలకు దగ్గర చేస్తాయి. అందుకు స్వీట్లు వంటివి టీతో పాటు తీసుకుంటే మనకు నష్టాలే వస్తాయి.

ఫ్రై చేసిన పదార్థాలు కూడా టీతో పాటు తీసుకోవద్దు. ఇందులో ఆయిల్ బాగా ఉంటుంది. ఇవి త్వరగా జీర్ణం కావు. అందుకే వీటికి దూరంగా ఉండాలి. ఇలా టీతో పాటు ఈ పదార్థాలు తీసుకుంటే మనకు అనారోగ్యాలే వస్తాయి. దీంతో వీటిని దూరంగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags