Diabetes: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో డయాబెటిస్ తో బాధ పడే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. మధుమేహంతో బాధ పడేవాళ్లు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం గుమ్మడికాయ గింజల సహాయంతో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతే మధుమేహం బారిన పడే అవకాశం అయితే ఉంటుంది.
మధుమేహం వల్ల శరీరంలో ప్రధాన అవయవాలు దెబ్బ తినే అవకాశం అయితే ఉంటుంది. గుమ్మడికాయ గింజలలో శరీరానికి అవసరమైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతిరోజూ 50 గ్రాముల గుమ్మడికాయ గింజలను తింటే చక్కెరస్థాయిని 35 శాతం నియంత్రించడం సాధ్యమవుతుంది. గుమ్మడికాయ గింజల్లో ఉండే మెగ్నీషియం శరీరాన్ని మరింత శక్తివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
Also Read: ప్రజల్లో ఆందోళన పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్?
మెగ్నీషియం వల్ల మధుమేహ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మధుమేహంతో బాధ పడేవాళ్లు మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. తృణధాన్యాలు, గింజలు, పచ్చి ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. గుమ్మడి గింజలలో ఉండే విటమిన్-ఇ కెరోటినాయిడ్స్ శరీరానికి వాపు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
గుమ్మడి గింజలు లేదా నూనె శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు రక్తపోటు ప్రమాదంను తగ్గించడంలో ఉపయోగపడతాయి. గుమ్మడికాయ గింజలను ఫైబర్ మూలంగా పరిగణిస్తారు. తక్కువ రక్తంలో చక్కెరను గ్రహించడంలో ఇది తోడ్పడుతుంది.
Also Read: అల్లం నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?