Eating these foods: అందమైన జీవితానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. మార్కెట్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్న కొన్ని మాత్రమే శరీరానికి మేలు చేస్తాయి. కానీ మేలు చేసే వాటిని చాలామంది తీసుకోవడం లేదు. దీంతో రకరకాల రోగాల బారిన పడుతున్నారు. కొందరు ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే వారిని చూస్తున్నాము. గుండెపోటుకు గురికావడానికి ప్రధాన కారణం రక్తం గడ్డ కట్టడం. శరీరంలోకి వెళ్లే ఆహారాలలో పోషకాలను రక్తం గ్రహించి శరీరంలోని వివిధ భాగాలకు చేరవేస్తుంది. ఇదే సమయంలో ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ను రవాణా చేస్తుంది. అందువల్ల రక్తం శరీరానికి ప్రధాన ఇంధనం లాంటిది. అయితే ఒక్కోసారి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుతుంది. ఇది అలాగే ఉండిపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులోనూ రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండెపోటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. మరి రక్తాన్ని శుద్ధి చేసే ఆహారమేదో తెలుసుకుందాం..
వంటింట్లో నిత్యం ఉండే పసుపు గురించి ఎక్కువగా మాట్లాడుకొం. కానీ పసుపు యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది, శరీరానికి ఎక్కడైనా చిన్న గాయం అయితే పసుపును వేస్తే వెంటనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పసుపులో కర్క్యూమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ప్లేట్లెట్ సమ్మేళనంగా పనిచేస్తుంది. దీనివల్ల రక్తం గడ్డ కట్టకుండా ఆగిపోతుంది. వీటితోపాటు చేపలు తినడం వల్ల కూడా రక్తం పలుచగా మారుతుంది. ఈ విషయాన్ని సైంటిస్టులే తేల్చేశారు. చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తం వాపు కాకుండా నివారిస్తాయి. దీంతో రక్తం ప్రసరణ సక్రమంగా ఉంటే గుండెపోటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
మనం రోజు తినే ఆహారంలో అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. కానీ కొందరు దీనిని అవాయిడ్ చేస్తారు. ప్రతి ఆహారంలో అల్లం వెల్లుల్లి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అల్లం జీర్ణాశయానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. వెల్లుల్లి లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో అల్లి సీన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా కాపాడడానికి వెల్లుల్లి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే అల్లాంలో యాంటీ ఇన్ఫ్లో మీటరీ గుణాలు ఉంటాయి. ఇవి కూడా రక్తం పలచన చేస్తాయి. రోజు తినే ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.
వీటితోపాటు బెర్రీ పండ్లు లేదా డార్క్ చాక్లెట్లు తినడం వల్ల కూడా రక్తంలో వాపు అనేది ఉండకుండా చేస్తాయి. డార్క్ చాక్లెట్లను తినడం వల్ల రక్తం మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ప్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తం గడ్డకట్టకుండా అరికాడుతుంది. ఇంత గుండెపోటును రానీయకుండా చేస్తుంది. అదేవిధంగా స్ట్రాబెర్రీ, చెర్రీ లో కూడా యాంటీ ప్లేవలెట్ లక్షణాలు ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తం పనితీరు మెరుగ్గా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.