Cadbury Dairy Milk: చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి చాక్లెట్స్ అంటే ఎంతో ఇష్టం. వీటిని ఇష్టంగా తింటారు కూడా. కానీ ఈ మధ్యకాలంలో చాక్లెట్స్ తినాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన చాక్లెట్స్ లభిస్తున్నాయి. వీటిలో చాలా రకాల చాక్లెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. వాటిలో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ వినియోగదారులకు ఆందోళన చెందిస్తుంది. వామ్మో మేం కూడా ఇష్టంగా తింటాం.. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా?
ఇటీవల హైదరాబాద్ లోని అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి క్యాడ్బరీ చాక్లెట్ కొన్నాడు. కవర్ ఓపెన్ చేసి తీరా తిందాం అనుకుంటే..అందులో సజీవంగా ఉన్న పురుగు కనిపించింది. దీంతో ఆ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాడ్బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ తినడంపై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాడ్బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ నిర్దారించింది.
క్యాడ్బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ తినకూడదని వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే క్యాడ్బరీ కి చెందిన అన్ని రకాల చాక్లెట్స్ కాకుండా కేవలం రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ మాత్రమే సురక్షితం కాదని తెలిపింది. అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్ లో పురుగులున్న ఆ శాంపిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.