https://oktelugu.com/

Stress Remedies : ఇవి తినండి.. మీ ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడిని తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాం. ఒత్తిడి తగ్గడానికి కొన్ని ఆహారాలను తీసుకోవడం మంచిది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటే మార్గం సుగమం అవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 23, 2023 / 08:31 AM IST
    Follow us on

    Stress Remedies : ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి తలొగ్గుతున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి గట్టెక్కే క్రమంలో ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో అనేక సమస్యలకు కేంద్రంగా నిలుస్తున్నాం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాం. ఒత్తిడి తగ్గడానికి కొన్ని ఆహారాలను తీసుకోవడం మంచిది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటే మార్గం సుగమం అవుతుంది.

    డార్క్ చాక్లెట్

    ఒత్తిడిని తగ్గించుకునే చర్యల్లో భాగంగా డార్క్ చాక్లెట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిని దూరం చేయడానికి సాయపడుతుంది. జ్ణాపకశక్తిని పెంచుతుంది. ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా డార్క్ చాక్లెట్ కూడా మనకు ఎంతో దోహదం చేస్తుంది.

    బెర్రీలు

    ఒత్తిడిని తగ్గించడంలో బెర్రీలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు ఒత్తిడిని దూరం చేయడానికి సహకరిస్తాయి. ఉదయం బెర్రీలు తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన లేకుండా పోతాయి. వీటిని పెరుగుతో కలిపి తినడం ఎంతో శ్రేయస్కరం. ఇలా ఒత్తిడిని తట్టుకునే బెర్రీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    నారింజ

    నారింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆందోళనలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. రోజువారీ ఆహారంలో భాగంగా వీటిని చేర్చుకుంటే మంచి ఫలితాలు రావడం సహజం. విటమిన్ సి వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళనలు లేకుండా పోతాయి. ఇలా మనం రోజు తినే వాటితోనే మనకు ఒత్తిడి దూరం కావడం జరుగుతుంది.

    అరటి పండ్లు

    అరటి పండు ఎన్నో పోషకాలు ఉన్నది. ఇందులో 37 మిల్లీ గ్రాముల మెగ్నిషియం ఉంటుంది. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించేందుకు సహకరిస్తుంది. గుండె జబ్బుల ముప్పును దూరం చేస్తుంది. మానసిక స్థాయిలను నియంత్రిస్తుంది. మానసిక ప్రశాంతత లభించేందుకు దోహదం చేస్తుంది. ఇలా అరటిపండు మనకు చాలా రకాలుగా ఆరోగ్య రక్షణ కలిగిస్తుంది.