Health Issues In 30s: మన జీవితం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం కాలంలో చాలా మందిది ఉరుకులు, పరుగుల జీవితం. డబ్బు సంపాదనతో పాటు లక్ష్యాలను చేరుకోవాలన్న తాపత్రయంతో బిజీగా మారుతూ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో 50 ఏళ్లలో వచ్చే ఆరోగ్య సమస్యలు 30 ఏళ్లలోపు వారికే వస్తున్నాయి. సాధారణంగా Diabetes, Obesity, Cholesterol వంటి సమస్యలు వయసు పైబారిన వారిలో కనిపించేవి. కానీ నేటి కాలంలో 30 ఏళ్లలోపు వారిలోనే కనిపిస్తున్నట్లు ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026’ నివేదిక హెచ్చరించింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
Apollo Hospitals విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 30 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నారు. అంటే ఇంకా పూర్తి స్థాయి డయాబెటిస్ కాకపోయినా రక్తంలో చక్కెర స్థాయులు ప్రమాదకరంగా పెరుగుతున్న దశలో ఉన్నారని అర్థం. సగానికి పైగా యువతిలో ఒబెసిటీ, అలాగే అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయులూ కనిపించాయి. కూర్చునే జీవనశైలి, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగ జీవితం ప్రారంభించే వయసులోనే ఈ సమస్యలు శరీరంలో పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.
అయితే చిన్న వయసులోనే సమస్యను గుర్తిస్తే పరిస్థితిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. 30 ఏళ్ల లోపు ప్రీ-డయాబెటిక్‌గా గుర్తించిన వారిలో 28% మంది సరైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణతో మళ్లీ సాధారణ స్థితికి వచ్చారు. కానీ 50 ఏళ్లు దాటిన తర్వాత అదే అవకాశం కేవలం 7% మాత్రమే ఉంది. అంటే వయస్సు పెరిగేకొద్దీ శరీర స్పందన తగ్గిపోతుంది. వైద్యులు తెలుపుతున్ ప్రకారం.. పై వ్యాధుల లక్షణాలు లేకపోయినా సంవత్సరానికి ఒకసారి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, బీపీ, బరువు, నడుము కొలతలు పరీక్షించుకోవాలి. కుటుంబంలో డయాబెటిస్ లేదా గుండెజబ్బుల చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త అవసరం.
అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక, తక్కువ చక్కెర, తక్కువ నూనె, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, సరిపడ నిద్ర, ఒత్తిడి నియంత్రణలో ఉంచుకోవాలి. దీంతో Type 2 Diabetes, గుండెజబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.