Dry Fruits: డ్రైఫ్రూట్స్ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. వీటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయిన కూడా వీటిని కొనుగోలు చేసి తినడానికి ముఖ్య కారణం ఆరోగ్యానికి మంచిదని. అయితే ఈ డ్రైఫ్రూట్స్‌లో బాదం, పీస్తా, అంజీర్, జీడిపప్పు ఇలా ఉన్నాయి. వీటిని అందరూ కూడా తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వీటిని తింటారు. అయితే ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల దీర్ఘకాలికంగా బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. అయితే ఈ డ్రైఫూట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారని కొందరు భావిస్తారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా వీటిని తినవచ్చని అనుకుంటారు. కానీ కొన్ని రకాల డ్రైఫూట్స్‌ను మధుమేహం ఉన్నవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున తిన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ఇంకా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మధుమేహం ఉన్నవారు ఏయే డ్రైఫ్రూట్స్ తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కిస్‌మిస్
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కిస్‌మిస్‌ను మధుమేహం ఉన్నావారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గ్లూకోజ్ శాతం అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు పసుపు, నలుపు కిస్‌మిస్‌లను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంజీర్
అంజీర్‌లో పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిదే. కానీ వీటిని మధుమేహం ఉన్నవారు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. వీటివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండు ఖర్జూరం
ఖర్జూరంలో చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని పెంచుతాయి. కాబట్టి వీటిని మధుమేహం ఉన్నవారు తినకపోవడం మంచిది. ఎండు ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది.
ఆప్రికాట్స్
ఆప్రికాట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని డయాబెటిస్ ఉన్నవారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. మరి అంతగా తినాలనిపిస్తే వైద్యుల సూచనల మేరకు మాత్రమే తినాలి.
ఏవి తినాలంటే?
డయాబెటిస్ ఉన్నవారు బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటివి తినాలి. ఇందులో షుగర్ ఉండదు. దీనివల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే వీటిని కూడా అధికంగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్, ప్రొటీన్ ఆరోగ్యానికి మేలు చేసిన కూడా మధుమేహం ఉన్నవారికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.