ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?

మనలో చాలామందికి ఉదయం సమయంలో నిద్ర లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది పళ్లు కూడా తోముకోకుండా టీ తాగుతూ ఉంటారు. అయితే మన దినచర్యను టీతో ప్రారంభించడం కరెక్ట్ కాదని పలు అధ్యయనాలలో వెల్లడైంది. పళ్లు తోమకుండా టీ తాగితే నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ఛాన్స్ అయితే ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. టీలో ఉండే కెఫిన్ కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుందని చెప్పవచ్చు. ఉదయం […]

Written By: Navya, Updated On : October 31, 2021 10:19 am
Follow us on

మనలో చాలామందికి ఉదయం సమయంలో నిద్ర లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది పళ్లు కూడా తోముకోకుండా టీ తాగుతూ ఉంటారు. అయితే మన దినచర్యను టీతో ప్రారంభించడం కరెక్ట్ కాదని పలు అధ్యయనాలలో వెల్లడైంది. పళ్లు తోమకుండా టీ తాగితే నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ఛాన్స్ అయితే ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

టీలో ఉండే కెఫిన్ కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుందని చెప్పవచ్చు. ఉదయం సమయంలో టీ తాగడం వల్ల అసిడిటీ బారిన పడటంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పళ్లు తోముకోకుండా టీ తాగడం వల్ల కడుపు నొప్పి, వికారం ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట సమయం తర్వాత టీ తాగాలి.

టీలో ఉండే థియోఫిలిన్ అనే కెమికల్ వల్ల మలబద్ధకం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. స్నాక్స్ తో పాటు టీ తీసుకున్నా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎవరైతే ఖాళీ కడుపుతో టీ తాగుతారో వాళ్లు అందులో ఉండే నికోటిన్ వల్ల టీకి అడిక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అతిగా టీ తాగేవాళ్లకు ఐరన్ లోపం వల్ల ఎనీమియా, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికే పరగడుపున టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును దూరం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.