చిత్తూరులోని ప్రముఖ సంస్థలో 14 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

నేషనల్‌ అట్మాస్పియర్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 14 ఉద్యోగ ఖాళీలలో సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ ఉద్యోగ ఖాళీ 1, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో ఉద్యోగ ఖాళీలు 13 […]

Written By: Navya, Updated On : October 31, 2021 10:14 am
Follow us on

నేషనల్‌ అట్మాస్పియర్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 14 ఉద్యోగ ఖాళీలలో సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ ఉద్యోగ ఖాళీ 1, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో ఉద్యోగ ఖాళీలు 13 ఉన్నాయి.

ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసిన వాళ్లు సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పాసైన వాళ్లు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్‌/ గేట్‌/ జామ్‌/ జెస్ట్‌ పరీక్షలలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు.

ఆన్ లైన్ విధానం ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు వేతనం లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 31,000 రూపాయల వేతనం లభించనుంది. 2021 సంవత్సరం నవంబర్ 29 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://www.narl.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.