https://oktelugu.com/

Red Wine Corona: బీర్ వద్దు.. రెడ్ వైన్ తాగండి.. కరోనా దరిదాపుల్లోకి రాదంట?

Red Wine Corona: మందు తాగితే పోతార్రోయ్ అంటూ పెద్దలు శపిస్తారు. మద్యం శరీరానికి హానికరం అని వైన్ బాటిల్ మీదనే రాసి ఉంటుంది. కానీ తాజాగా వైన్ తాగితే పది కాలాల పాటు బతుకుతారని తేలింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ‘రెడ్ వైన్’ తాగాలంటూ తాజా పరిశోధన తేల్చింది. బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ అధికారికంగా వెల్లడించిన రిపోర్ట్ ఇదీ.. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రీషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2022 / 07:36 PM IST
    Follow us on

    Red Wine Corona: మందు తాగితే పోతార్రోయ్ అంటూ పెద్దలు శపిస్తారు. మద్యం శరీరానికి హానికరం అని వైన్ బాటిల్ మీదనే రాసి ఉంటుంది. కానీ తాజాగా వైన్ తాగితే పది కాలాల పాటు బతుకుతారని తేలింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ‘రెడ్ వైన్’ తాగాలంటూ తాజా పరిశోధన తేల్చింది. బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ అధికారికంగా వెల్లడించిన రిపోర్ట్ ఇదీ..

    ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రీషన్ అనే జర్నల్ లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రకటించారు. వారానికి 5 కంటే ఎక్కువ గ్లాసులు రెడ్ వైన్ తీసుకుంటున్న వ్యక్తులు మిగతా వారికంటే తక్కువగా కరోనా బారినపడుతున్నట్టు తేలింది.

    బయో బ్యాంక్ అనే బ్రిటన్ డేటా బేస్ ఆధారంగా చైనాలోని షెంజన్ వైద్య నిపుణులు విశ్లేషించారు. కరోనా కాలంలో మద్యం తాగే అలవాటు, ఆయా వ్యక్తులు వైరస్ బారినపడిన సంఖ్య , లక్షణాలను విశ్లేషించేందుకు ఈ సర్వే చేశారు.

    4,73,957 మంది మద్యం తాగే వ్యక్తుల డేటా బేస్ ను పరిశీలించగా 16559మంది కరోనా బారినపడినట్లు నిర్ధారించారు. వీళ్లలో రకరకాల మద్యం బ్రాండ్లు తాగేవాళ్లున్నారు. అయితే ఎవరైతే ఎక్కువగా తమ జీవిత కాలంలో రెడ్ వైన్ తాగుతున్నారో వాళ్లు, మిగతా వాళ్లతో పోలిస్తే 17శాతం తక్కువగా కరోనా వైరస్ కు గురయ్యారు. ఇప్పుడు చెప్పుకున్న మద్యంలో పోలీఫెనాల్ అనే కారకం ఎక్కువగా ఉంటుంది.

    ఇది వైరస్ లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని వైద్యులు అంటున్నారు. ఇక వైట్ వైన్, షాంపేన్ తాగే వారు 8శాతం తక్కువగా కరోనా బారినపడినట్లు స్టడీ వెల్లడించింది. ఇదే సమయంలో ఎవరైతే రెగ్యులర్ గా బీర్ తాగుతారో, వాళ్లు ఇతరులతో పోలిస్తే 28శాతం ఎక్కువగా వైరస్ బారినపడే ప్రమాదం ఉందని తేలింది.