Effects of Alcohol: ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో సంతానలేమి సమస్య కూడా ఒకటనే సంగతి తెలిసిందే. పర్యావరణ పరిస్థితులు, హార్మోన్ల సమస్య, జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు కారణమవుతున్నాయి. పెళ్లైన తర్వాత పిల్లలు పుట్టకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న జంటలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండటం గమనార్హం. అయితే మద్యం తాగేవారిలో సంతానలేమి సమస్య ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. 25 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. మద్యం తాగేవాళ్లలో వీర్యం పరిమాణం తక్కువగా ఉండటంతో పాటు వీర్య కణాల సంఖ్య కూడా తక్కువగానే ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 231 మంది పురుషులపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.
Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు కట్టాలంట.. జగన్ పెద్ద ప్లానే వేశారే..!
మద్యం తీసుకునే వాళ్లకు వృషణంలోని లెడిగ్ కణాలపై ఆల్కహాల్ ప్రభావం పడుతోందని వెల్లడైంది. మద్యం తాగడం వల్ల వీర్యం విడుదలకు కారణమయ్యే హార్మోన్లపై కూడా ప్రభావం పడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు వెంటనే ఆ అలవాటును దూరం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మద్యం తాగడం వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదు.
మద్యం తాగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. మద్యం అలవాటును మానుకుంటే ఆరోగ్యానికి మంచిది. మద్యం అలవాటును మానేయడంలో ఇబ్బందులు ఎదురైతే వైద్య నిపుణుల సలహాలను పాటించడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: జగ్గారెడ్డి రాజీనామాను ఆమోదిస్తుందా? అడ్డుకుంటుందా?