
కొన్ని వందల సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న కూరగాయలలో దోసకాయ ఒకటనే సంగతి తెలిసిందే. దోసకాయ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దోసకాయల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, విటమిన్ కే లభిస్తాయి. నీటి శాతం కూడా అధికంగా ఉండే కూరగాయలలో దోసకాయ ఒకటని చెప్పవచ్చు. దోసకాయ పానీయం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దోసకాయలను ముక్కలుగా కోసి వాటిని గాజు గ్లాసులో ఉంచి నీరు పోసి నానబెడితే దోసకాయ పానీయం సులువుగా తయారవుతుంది. దోశకాయ పానీయం తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు సులువుగా విసర్జించబడతాయి. దోసకాయ పానీయం తాగడం వల్ల శరీర బరువు అదుపులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎములను దృఢంగా ఉంచడంలో దోసకాయ ఎంతగానో సహాయపడుతుంది.
దోసకాయ నీళ్లు తాగడం వల్ల జీవక్రియ పనితీరు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చేయడంలో దోసకాయ నీళ్లు సహాయపడతాయి. నీళ్లు, దోసకాయ కలిసినప్పుడు అందులో విటమిన్లు, ఖనిజాలు చేరే అవకాశం ఉంటుంది. దోసకాయ బీపీ స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది. దోసకాయ నీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు సైతం దూరమవుతాయి.
బరువు తగ్గించడంలో దోసకాయ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ వల్ల మూత్ర క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. క్యాన్సర్ కణాలను చంపడంలో దోసకాయలు తోడ్పడతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. దోసకాయ నీటిలో ఉండే ఫిసినెట్ మెమరీ శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
దోసకాయ నీళ్లు తాగడం వల్ల వయస్సు పెరిగినా చర్మం బలంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. చర్మాన్ని బలంగా ఉంచడంలో దోసకాయ నీళ్లు సహాయపడతాయి. దోసకాయ పానీయం తాగడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు కాబట్టి దోసకాయ వాటర్ ను ప్రతిరోజు తాగితే మంచిది.