https://oktelugu.com/

Artificial Sweeteners : కృత్రిమ తీపి పదార్థాలు వాడకండి… అయితే ఈ హెచ్చరిక మీకే

అస్ప ర్టేమ్ పై వారి సమీక్షకు శాస్త్రీయ సమగ్రత లేదు. విశ్వసనీయత లేని పరిశోధన ఆధారంగా నిర్ణయాలు సరికాదు అని" అంతర్జాతీయ కృత్రిమ తీపి అసోసియేషన్ చెబుతోంది.

Written By:
  • Rocky
  • , Updated On : July 1, 2023 / 02:41 PM IST
    Follow us on

    Artificial Sweeteners : ఒకప్పుడు అంటే చెరుకును గానుగాడించి దాని ద్వారా వచ్చిన చక్కెరతో వివిధ తీపి పదార్థాలు తయారు చేసేవారు. కాలక్రమేణా జనాభా పెరగడం, ఆహార పదార్థాల తయారీలో మార్పులు చోటు చేసుకోవడంతో కృత్రిమ తీపి అనేది తెరపైకి వచ్చింది. దీని ద్వారా కోకా కోలా, పెప్సీ వంటి శీతల పానీయాలు మొదలుకొని చూయింగ్ గమ్, క్యాండీ లు తయారు చేయడం ప్రారంభమైంది.. వీటి వినియోగం కూడా పెరగడంతో మార్కెట్లోకి కొత్త కొత్త ఆహార ఉత్పత్తులు వస్తున్నాయి. అయితే ఈ కృత్రిమ తీపి ఆరోగ్యానికి మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కృత్రిమ తీపి పదార్థాలలో ఒకటైన “అస్ప ర్టేమ్”క్యాన్సర్ కారకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ కృత్రిమ తీపిని ఆహార పదార్థాల్లో వినియోగించుకునేందుకు 1981లో అమెరికా ఆహార ఔషధ సంస్థ (ఎఫ్డీఏ) అనుమతులు ఇచ్చింది. కానీ దీనిపై వరుసగా సమీక్షలు జరిగాయి. కానీ ఇంతవరకు సురక్షితమా? కాదా? అనేదానిపై ఒక స్పష్టత రాలేదు. అయినప్పటికీ దీనిని దీనిని భారత్ సహా 90 దేశాల్లో ఉపయోగిస్తున్నారు.

    ఎటువంటి క్యాలరీలలు ఉండవు
    అస్ప ర్టే మ్ ను అధికంగా వినియోగించేందుకు ప్రధాన కారణం ఇందులో ఎటువంటి క్యాలరీలు ఉండకపోవడమే. సాధారణమైన చక్కెర తో పోలిస్తే ఇది 200 రెట్లు ఎక్కువ తీయగా ఉంటుంది. అందువల్లే బేకరీ ఉత్పత్తులు, శీతల పానీయాల తయారీలో దీనిని విపరీతంగా వాడుతారు. ఆ ఉత్పత్తుల్లో తీపిని మరింత పెంచేందుకు ఇటీవల ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు తెలిసింది. అయితే భారత్ లో పదార్థాల నియంత్రణ సంస్థ కృత్రిమ తీపి పదార్థాల వాడకం, గరిష్ట పరిమితులకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే ఆహార పదార్థాల్లో వినియోగించే కృత్రిమ తీపి పదార్థాలతో క్యాన్సర్ వచ్చే ముప్పు అధికమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ తన సమీక్షలో స్పష్టం చేసింది. అస్ప ర్టేమ్ ను తొలిసారిగా క్యాన్సర్ కారక పదార్థాల జాబితాలో చేర్చనున్నట్టు సమాచారం.
    త్వరలో వెల్లడించే అవకాశం
    ఈ నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే జాబితాలో ఈ కృత్రిమ తీపి పదార్థాన్ని చేర్చనున్నట్టు తెలుస్తోంది. కృత్రిమ తీపి పదార్థాల వినియోగం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది అనడానికి ఆధారాలు, నిపుణుల తో చర్చలు జరిపిన తర్వాతే  ఐఏ ఆర్ సీ   అస్ప ర్టేమ్ ను క్యాన్సర్ కారకంగా గుర్తించినట్టు సమాచారం.ఐఏఆర్ సీ గతంలో కొన్ని పదార్థాలపై ఇచ్చిన సమాచారం వల్ల వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారని, ఆయా పదార్థాల తయారీదారులు  ఐఏ ఆర్ సీ పై దావాలూ వేశారని ఆహార రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ” ఐఏ ఆర్ సీ అనేది ఆహార భద్రత సంస్థ కాదు. అస్ప ర్టేమ్ పై వారి సమీక్షకు శాస్త్రీయ సమగ్రత లేదు. విశ్వసనీయత లేని పరిశోధన ఆధారంగా నిర్ణయాలు సరికాదు అని” అంతర్జాతీయ కృత్రిమ తీపి అసోసియేషన్ చెబుతోంది.